బండి సంజయ్ యాత్రలో నేతల వారసుల హడావుడి…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యువనేతలు ఎదగాలంటే సరైన సందర్భాలు కావాలి. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
అప్పుడే రాజకీయంగా ఎదుగుతారు. తెలంగాణ బిజెపి యువనేతలకు సంజయ్ యాత్ర రూపంలో ఓ ఛాన్స్ వచ్చింది. తమ టాలెంట్ రుజువు చేసుకోటానికి శాయశక్తులా కష్టపడుతున్నారట. పాదయాత్ర చేస్తున్న సంజయ్ టార్గెట్ ఒకటైతే, వారసుల టార్గెట్ మరొకటిగా మారింది..
సంజయ్ సంగ్రామ యాత్రలో నేతల వారసులు హడావుడి చేస్తున్నారు. పనిలో పనిగా కమలం పార్టీలో తమ భవిష్యత్ కి గట్టి పునాదులు వేసుకుంటున్నారు. పాదయాత్ర వేదికగా తమ ఇమేజ్ ను పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే ఎన్నికలు టార్గెట్ గా పెట్టుకుని కష్టపడుతున్నారట.
Also Read
బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర లో ఎక్కువగా యువత కనిపిస్తోంది. పార్టీ కి చెందిన యువ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ యాత్రలో భాగం అవుతున్నారు. పాదయాత్ర ఏర్పాట్ల కోసం వేసిన కమిటీల్లోనూ యువనేతలకు ఎక్కువగా చోటు కల్పించారు. ఈ కమిటీ ల్లో పార్టీ నేతల వారసులకు ఎక్కువగా స్థానం కల్పించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు వారసులు కష్ట పడుతున్నారు. పాద యాత్రలోనే ఎక్కువ సమయం ఉంటున్నారు.
ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ కొడుకు వీరేందర్ గౌడ్ ప్రస్తుతం బీజేపీ లో ఉన్నారు. సంజయ్ సంగ్రామ యాత్ర కు సహా ఇంచార్జ్ గా ఉన్నారు. ఈ యాత్ర లో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు. అటు బీజేపీ సీనియర్ నేత హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి కూడా సంజయ్ యాత్రలో పాల్గొంటున్నారు.
ఇక మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రంగౌడ్ గ్రేటర్ ఎన్నికల సమయం లో బీజేపీలో చేరారు. పాదయాత్ర సందర్భంగా ఆయనకు కూడా బాధ్యత అప్పగించారు. జన సమీకరణ విభాగంలో ఆయన ఉన్నారు.
మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి సంగ్రామ యాత్రలో యాక్టివ్ గా పాల్గొంటున్నారు. మిథున్ రెడ్డి కూడా సంజయ్ వెంటే ఉంటున్నారు. ప్రచార రథాల విభాగంలో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ కొడుకు కూడా సంజయ్ పాద యాత్రలో చురుగ్గా పాల్గొంటున్నారు. సంజయ్ వెంట రెగ్యులర్ గా ఉంటున్నాడు. తన టీమ్ తో హడావుడి చేస్తున్నారు.
మరో మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశిష్ గౌడ్ సంజయ్ పాద యాత్రలో చురుగ్గా పాల్గొంటున్నారు. బల ప్రదర్శన చేసుకుంటున్నారు. వాహన శ్రేణి విభాగం లో బాధ్యతలు చూస్తున్న ఆయన సంజయ్ వెంటే ఉంటున్నారు.. పూర్తి సమయం ఇచ్చి పని చేస్తున్నారు…
ఈ వారసులంతా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు ఆశిస్తున్నారట. రాజకీయంగా బల పడేందుకు, పార్టీలో పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారట, సంజయ్ సంగ్రామ యాత్ర వారసులకు ఇలా ఉపయోగపడుతోందనే టాక్ నడుస్తోంది. దీంతో పాదయాత్ర సాక్షిగా, సామర్థ్యం నిరూపించుకునే వారసులెవరో, వచ్చే అసెంబ్లీ ఎన్నికల సంగ్రామంలో బరిలో నిలిచే అవకాశం ఎవరికి వస్తుందో అనే ఆసక్తి ఏర్పడింది.
తాజావార్తలు
-
Gayapadda Simham: ‘గాయపడ్డ సింహం’ ఓటీటీ రిలీజ్..
-
Honda City facelift: భారత మార్కెట్లోకి సరికొత్త హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్.. అదిరిపోయే లుక్స్, ఫీచర్లు!
-
Kodak QLED Smart TV: కోడాక్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ రిలీజ్.. Google TV 5.0తో థియేటర్ ఫీల్!
-
Peddi: ‘పెద్ది’ నుండి స్పెషల్ సాంగ్ ప్రోమో రిలీజ్.. అదిరిపోయిన చరణ్ – శృతి స్టెప్స్
-
Kangana Ranaut: మెడలో నల్లపూసలు.. చేతికి గాజులు..కంగనా రనౌత్ సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!