Dreaming: మీరు చనిపోయినట్లు కల వస్తుందా? షాక్ అయ్యే నిజం ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dreaming: పని చేసి అలసిపోతే కాసేపు బ్రేక్ తీసుకుంటే సరికొత్త ఉత్సాహంతో పని చేయడానికి జోష్ వస్తుంది. అచ్చం అలాగే శరీరం కూడా రోజంతా పని చేసి రాత్రి సమయంలో నిద్రపోయేటప్పుడు విశ్రాంతి తీసుకొని సరికొత్త ఉత్సాహంతో తర్వాత రోజును స్టార్ట్ చేయడానికి సిద్ధం అవుతుంది. చాలా మందికి నిద్రపోయే టైంలో కలలు రావడం జరుగుతుంది. నిజానికి ఇలా కావడం సర్వసాధారణం. కలలకు కూడా శాస్త్రం ఉందని మీలో ఎంత మందికి తెలుసు. ఆ శాస్త్రం పేరే స్వప్న శాస్త్రం. మనిషి నిద్రలోకి వెళ్లినప్పుడు ఒక ప్రత్యేకమైన ప్రపంచంలోకి ప్రవేశిస్తాడని, ఆ సమయంలో ఎన్నో రకాల కలలు వస్తాయని స్వప్న శాస్త్రం చెబుతోంది. కొన్ని కలలు ఉదయం లేవగానే మర్చిపోతాం. కానీ కొన్నిసార్లు మనకు మనమే చనిపోయినట్లు కల వస్తే మాత్రం ఆ ఆలోచన నుంచి బయటపడటం అంత సులభం కాదు. అసలు ఇలాంటి కలలకు అర్థం ఏమిటి? ఇవి శుభ సూచనలా? అశుభ సంకేతాలా? అనే సందేహాలు చాలామందిలో ఉంటాయి. దాని కథ ఏంటో ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.
కలలో సొంత మరణం కనిపిస్తే ఏం జరుగుతుందంటే..
ప్రాచీన కాలం నుంచి కలలను భవిష్యత్తులో జరగబోయే పరిణామాలతో అనుసంధానం చేస్తూ వచ్చారు. రామాయణ కాలంలో కూడా కొన్ని కలలు రాబోయే సంఘటనలకు సంకేతాలుగా భావించబడ్డాయని పురాణాల్లో ప్రస్తావనలు ఉన్నాయి. అయితే ప్రస్తుత కాలంలో ఇలాంటి కలలు వచ్చినప్పుడు భయపడాల్సిన అవసరం లేదని స్వప్న శాస్త్రం వివరిస్తోంది. స్వప్న శాస్త్రం ప్రకారం.. మీ కలలో మీరు చనిపోవడం చూడటం అశుభం కాదని, అది శుభ సూచకం అని చెబుతుంది. జీవితంలో ఉన్న ప్రతికూల పరిస్థితులు తొలగిపోయి, కొత్త అవకాశాలు ప్రారంభమయ్యే సమయం దగ్గరపడిందని దీనికి అర్థంగా చెబుతారు. విజయం, అదృష్టం కలిసి వచ్చే సంకేతంగా కూడా కొందరు నమ్ముతారు.
Also Read
- Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనయోగం!
- Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
- Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
- Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
ఎవరైనా తమను తాము కలలో అనారోగ్యంతో ఉన్నట్లు చూస్తే, అది ఆరోగ్యంలో మెరుగుదలకు సంకేతంగా భావిస్తారు. అలాగే కలలో ఖర్మ చేసే టైంలో పెట్టే భోజనం చేస్తున్నట్లు కనిపిస్తే, అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభించే సూచనగా స్వప్న శాస్త్రం చెబుతోంది. కలలో మీరు ఆకాశంలో ఎగురుతున్నట్లు కనిపిస్తే, జీవితంలోని సమస్యలు, ఆందోళనలు తొలగిపోతాయని అర్థం అని, అలాగే తాను అగ్నిలో కాలుతున్నట్లు కల వస్తే, అది ధన లాభానికి సంకేతం అని పేర్కొంటారు. స్వప్న శాస్త్రం ప్రకారం, కలలో తనకు తానే హాని చేసుకున్నట్లు కనిపించడం ఒక పెద్ద సమస్య నుంచి బయటపడే సంకేతంగా చెబుతారు. అయితే కొన్ని నమ్మకాల ప్రకారం ఇది రాబోయే సవాళ్లకు సూచనగా కూడా భావిస్తారు. కలలో మనకు దగ్గరైన వ్యక్తి మరణించినట్లు కనిపిస్తే, అది ఆ వ్యక్తి జీవితంలో పెద్ద మార్పు రాబోతుందనే సంకేతంగా కొందరు నమ్ముతారు. ఇక కలలో దెయ్యాలు లేదా భూతాలు కనిపించడం రాబోయే ఇబ్బందులకు సూచనగా భావిస్తారు. అయితే కలలకు సంబంధించిన విషయాలు ప్రధానంగా సంప్రదాయ నమ్మకాలు, స్వప్న శాస్త్రంపై ఆధారపడి ఉంటాయి. శాస్త్రీయంగా కలలు మన ఆలోచనలు, అనుభవాలు, భావోద్వేగాల ప్రభావంతో కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు