OTR: ముగ్గురు అధ్యక్షులు, ముచ్చటగా మూడు జిల్లాలు.. కానీ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ఎక్కడ?
- మూడు జిల్లాలు...ముగ్గురు అధ్యక్షుల నియామకం
- ఆ తర్వాత గ్రేటర్‌ను వదిలేసినట్టేనా..?
- మిగిలిన పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతుంటే అధికార పార్టీ ఆదమరిచిందా?
- గ్రౌండ్లో కొత్త అధ్యక్షుల యాక్టివిటీ ఏది?
- గ్రేటర్ ఎన్నికలకు సిద్ధమవ్వాలన్న ఆలోచనే లేదా?
- మూసీపై ఇంత రచ్చ జరుగుతున్నా గ్రేటర్ కాంగ్రెస్ చేసిందేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్రేటర్ హైదరాబాద్ అంతా ఒకే గొడుగు కింద వుంటే నాయకత్వానికి కష్టమవుతుందని కాంగ్రెస్ పార్టీ మూడు జిల్లాలుగా విభజించుకుంది. ఓల్డ్ సిటీ అంతా హైదరాబాద్ జిల్లాగా.. సికింద్రాబాద్.. ఖైరతాబాద్లుగా డివైడ్ చేసుకుంది. జిల్లాలు ఏర్పడ్డాయి కాబట్టి..హైదరాబాద్ జిల్లాకు సయ్యద్ ఖలిద్ సైఫుల్లాను…ఖైరతాబాద్ జిల్లాకు యూత్ లీడర్ మోత రోహిత్ ను..సికింద్రాబాద్‌కి దీపక్ జాన్‌ను అధ్యక్షులుగా నియమించింది. అంతవరకు బాగానే వుంది..అధ్యక్షులను పార్టీ నాయకత్వం వేసింది. కానీ. కమిటీ వెయ్యలేదు. అధ్యక్షులు గ్రౌండ్ లో పనీ చేయడం లేదు. గ్రేటర్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయని మిగిలిన పార్టీలు ఇప్పటికే డివిజన్ల వారిగా పని మొదలుపెట్టాయి. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం గల్లీల వైపు చూడ్డం లేదు. బస్తీల్లో తిరగడం మానేసినట్టు కనిపిస్తోంది. పదవులు వచ్చిన నేతలు… మనకు పదవి వచ్చిందిలే అనుకుంటున్నారు తప్పితే..పార్టీ నిర్మాణం…గ్రేటర్ ఎన్నికలకు సిద్ధమవ్వాలన్న ఆలోచనే మరిచిపోయినట్టు ఉంది.
పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్..గ్రేటర్ పై ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న చర్చ పార్టీలోనే గట్టిగా వినిపిస్తోంది. గ్రేటర్ ఎన్నికలు కాంగ్రెస్‌కి సవాల్. గ్రేటర్‌ను మూడు కార్పొరేషన్ లుగా విభజించింది ప్రభుత్వం. మూడు వందల డివిజన్లు అయ్యాయి. అసలే గ్రేటర్లో పార్టీ అంతంత మాత్రం. MLA లు కూడా ఇద్దరే..! రెండు సీట్లు కూడా ఉప ఎన్నికల్లో గెలిచింది కాంగ్రెస్. అలాంటి గ్రేటర్లో పార్టీ యాక్టివిటీ అసలు కనిపించడమే లేదు. జిల్లా అధ్యక్షులుగా హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిని ఇప్పటి వరకు పార్టీలో చాలా మంది…నాన్ లోకల్ అంటూ ప్రచారం చేశారు. కాదని చెప్పే స్థాయిలో యాక్టివిటీ కూడా లేదు.
Also Read
ఇక ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడు మోత రోహిత్…యూత్ కాంగ్రెస్ నుంచి DCC స్థాయికి ఎదిగారు. యూత్ కాంగ్రెస్‌లో ఉండగా నిత్యం ఏదో ఒక యాక్టివిటీ చేస్తూ ఉండే వారు. కానీ DCC అయ్యాక…తన పరిధిలోని డివిజన్ల మీద ఇంకా ఫోకస్ చేసినట్టు లేరు. పార్టీ పదవులు ఇచ్చింది…పని కూడా చెప్తేనే చేస్తారా..? అనే స్థాయిలో గ్రేటర్ నాయకత్వం మీద పార్టీ అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక సికింద్రాబాద్ జిల్లా అంతే. DCC అధ్యక్షులుగా మంచి గుర్తింపు ఇచ్చింది పార్టీ. కానీ ఇప్పటి వరకు గ్రేటర్లో కాంగ్రెస్ కార్యక్రమాలే లేవు. మూసీపై ఇంతరచ్చ జరుగుతున్నా… గ్రేటర్ కాంగ్రెస్ చేసింది ఏం లేదు.
గ్రేటర్లో అసెంబ్లీ సీట్లు కూడా పెరగనున్నాయి. నాయకులను తయారు చేసుకోవాలి. ఓ వైపు డివిజన్ స్థాయిలో…మరోవైపు అసెంబ్లీ స్థాయిలో నాయకత్వం పెంచుకోవాలి. కానీ గ్రేటర్ నేతలు ఆ దిశగా అడుగులు వేయడం మానేసినట్టు ఉన్నారని పార్టీ శ్రేణుల్లో చర్చ వినిపిస్తోంది. PCC చీఫ్ మహేష్ గౌడ్ గ్రేటర్ పై ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పదేపదే కార్యకర్తలు చెబుతున్నారు. చూడాలి మరి గ్రేటర్ నేతలు పనిలో పడతారా..? లేదంటే PCCనే… గ్రేటర్ నేతలను గాడిలో పెడతుందా?
తాజావార్తలు
-
Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
-
Weather Update: ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ..
-
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌కు తీవ్ర గాయం.. రేపే సర్జరీ!
-
Lal Darwaza Bonalu: బోనాల వేళ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్.. 116 మంది అదుపులో..
-
Teacher Suspended: విద్యార్థినులతో లీలలు.. ప్రభుత్వ టీచర్ సస్పెండ్..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..