రాజకీయాలు అంటేనే గ్రూపులు ఉంటాయి. అందులోనూ అధికారపార్టీ అయితే ఆ సమస్య మరింత జఠిలం. రెండు, మూడు కూటములు ఉంటేనే భరించడం కష్టం. అటువంటిది విశాఖ దక్షిణ నియోజకవర్గంలో 10వరకు గ్రూపులు ఏర్పడ్డాయి. టీడీపీలో గెలిచి వైసీపీ పంచన చేరిన రెబల్ ఎమ్మెల్యే వాసుపల్లి ఎంట్రీతో ఇక్కడ పాలిటిక్స్ హీటెక్కడం మొదలైంది. ఎమ్మెల్యే అనుచరులు, ముఖ్య నాయకులు పార్టీలో చేరగా.. కొత్తవాళ్లతో సర్దుకుపోవడం ఆవిర్భావం నుంచి వైసీపీ జెండా మోసిన వాళ్లకు ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో…