టీఆర్‌ఎస్‌లో సంస్థాగత పదవుల జాతర..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అధికారపార్టీలో చిన్న పదవైనా ఎంతో డిమాండ్ ఉంటుంది. దానికి సెంటిమెంట్ కూడా తోడైతే పోటీ చెప్పక్కర్లేదు. ప్రస్తుతం అలాంటి ఓ పదవి కోసం విపరీతమైన పోటీనే నెలకొంది. కాకపోతే పాత విద్యార్థి.. కొత్త విద్యార్థి అనే పేరుతో యువ నేతల మధ్య రేస్ మొదలుకావడంతో ఆ పదవిపై ఉత్కంఠ పెరుగుతోంది.
టీఆర్‌ఎస్వీ అధ్యక్ష పదవి కోసం పోటీ!
Also Read
సంస్థాగత పార్టీ నిర్మాణంపై ఫోకస్ పెట్టింది అధికారపార్టీ టీఆర్ఎస్. సెప్టెంబర్ 2 నుంచి పార్టీ నేతలంతా ఇదేపనిలో ఉన్నారు. గ్రామస్థాయి నుంచి కమిటీల కూర్పుపై కసరత్తులు జరుగుతున్నాయి. టీఆర్ఎస్‌తోపాటు.. పార్టీ అనుబంధ విభాగాలను కూడా పటిష్ఠం చేయాలనే ఆలోచనలో ఉన్నారు గులాబీ పెద్దలు. దీంతో టీఆర్‌ఎస్‌లోని అనుబంధ విభాగాల అధ్యక్ష పదవులకు డిమాండ్ పెరిగింది. వీటిల్లో టీఆర్‌ఎస్వీ ప్రెసిడెంట్ పోస్ట్ కోసం కొందరు గట్టి ప్రయత్నాలు చేస్తుండటంతో చర్చగా మారింది.
సెంటిమెంట్ కూడా తోడు కావడంతో పెరిగిన పోటీ!
గతంలో TRSV ప్రెసిడెంట్లగా పనిచేసిన ఎర్రోళ్ల శ్రీనివాస్, బాల్క సుమన్‌లకు తర్వాతి కాలంలో కీలక పదవులు లభించాయి. ఎర్రోళ్ల శ్రీనివాస్ ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కాగా.. బాల్క సుమన్ ఎంపీగా పనిచేశారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. తాజాగా హుజురాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగిన గెల్లు శ్రీనివాస యాదవ్ సైతం TRSV అధ్యక్షుడిగా పనిచేశారు. దీంతో ఈ పదవి చేపడితే భవిష్యత్‌లో రాజకీయ పదోన్నతి ఖాయమనే సెంటిమెంట్ ఏర్పడింది. అలాగే పదవి చేపట్టేందుకు పోటీ పడుతున్నారు విద్యార్ధి నాయకులు.
కొత్త, పాత నేతల్లో ఎవరికి పదవి ఇస్తారు?
ప్రస్తుతం TRSV అధ్యక్ష పదవి విషయంలో పార్టీలో పాత, కొత్త అనే చర్చ మొదలైంది. తెలంగాణ రాక ముందు నుంచీ పార్టీలో TRSVలో పనిచేసిన వాళ్లు.. తెలంగాణ వచ్చాక పార్టీలోకి వచ్చినవాళ్ల మధ్య పోటీ నెలకొంది. పార్టీ ప్రయోజనాలు, రాజకీయ, సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని పదవుల్లో అవకాశం కల్పిస్తూ వస్తున్నారు గులాబీ నేతలు. సమయం, సందర్భాన్ని బట్టి పదవులు, అవకాశాలు పొందుతున్నవారిలో కొత్త పాత ఉంటూ వస్తున్నారు.
అప్పట్లో సోషల్ మీడియా కన్వీనర్ల పోస్టులపై చర్చ!
ప్రస్తుతం TRSV అధ్యక్షుడిగా కొత్త వారికి ఛాన్స్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో మొదటి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్లు తమ సంగతేంటని అప్పుడే ప్రశ్నలు మొదలుపెట్టారట. అప్పట్లో టీఆర్‌ఎస్ సోషల్ మీడియా విభాగంలో కన్వీనర్లుగా కొత్త వారికి అవకాశం ఇవ్వడంతో పాతవాళ్లు ఛాన్స్ దొరక్క మదన పడ్డారు. ఇప్పుడు TRSV పదవి కూడా కొత్త వారికే ఇస్తే పాత.. కొత్త వారి మధ్య సమన్వయం ఎలా అనే చర్చ జరుగుతోందట. ఈ విషయంలో పార్టీ పెద్దల ఆలోచన ఎలా ఉన్నా.. గులాబీ శిబిరంలో మాత్రం అన్ని పదవుల కంటే TRSV ప్రెసిడెంట్ పోస్ట్ పైనే ఎక్కువగా ఆరా తీస్తున్నారట. మరి..ఈ పదవి ఎవరిని వరిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
CM Revanth Reddy : యువతే గేమ్‌చేంజర్.. మోడీపై రేవంత్ విమర్శలు
-
Sikandar Raza: ‘త్వరలోనే కొన్ని పరుగులు కొనుక్కుంటా’.. ఓటమిపై సికందర్ రజా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Adilabad Airfield : ఆదిలాబాద్‌కు ఎయిర్పోర్ట్ బూస్ట్.. ₹2,278 కోట్ల మెగా ప్రాజెక్ట్
-
Shreyas Iyer: ‘నా ఫస్ట్ విన్ క్రెడిట్ అతనికే’.. అయ్యర్ నోటి నుంచి ఊహించని మాట..
-
Abhijeet Dipke: టైమ్ కావాలి, పంజాబ్ పేపర్ లీక్‌పై స్పందిస్తాము..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!