OTR: మానుకోటలో కారు పార్టీ గ్రూప్ వార్‌పై కేటీఆర్ క్లాస్..?
- మానుకోట గులాబీ దళంలో పెరుగుతున్న గ్రూప్‌వార్..
- కలిసి ఉన్నట్టు కనిపిస్తున్నా సందర్భం వచ్చినప్పుడు ఎవరికి వారే..
- మహబూబాబాద్, డోర్నకల్‌లో అసెంబ్లీ టిక్కెట్ల కోసం అప్పుడే పోటీ..
- మహబూబాబాద్‌లో శంకర్ నాయక్ వర్సెస్ మాలోత్ కవిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మానుకోట కారులో మంటలు చెలరేగుతున్నాయా? వాటిని ఇప్పుడే ఆర్పకుంటే…ఇంకేం మిగలని పరిస్థితులు తలెత్తుతాయా? రెండేళ్ళ ముందు నుంచే అసెంబ్లీ టిక్కెట్ల కోసం నాయకులు కొట్లాడుకుంటుంటే… ఎవరి వైపు నిలబడాలో అర్ధంగాక కేడర్ దిక్కులు చూస్తోందా? గ్రూప్స్ నడుపుతున్న నేతలపై వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీరియస్ అయ్యారా? ఎవరా నాయకులు? ఏంటా సీటుపోట్ల కథలు?
మానుకోటలో గులాబీ కోటకు బీటలు వారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ సంపాదించి చట్టసభలో అడుగు పెట్టాలన్న లక్ష్యంతో ఎవరికి వారు పావులు కదుపుతుండటంతో గ్రూప్‌వార్ పెరిగిపోతోందంటున్నారు. మహబూబాబాద్ జిల్లా కారు పార్టీలో గ్రూప్ వార్ పెరిగిపోయి ఒకే గిరిజన జాతికి చెందిన బిడ్డల పంచాయితీ రచ్చకెక్కుతుండడం కేడర్‌ను కూడా గందరగోళంలో పడేస్తోందట. డోర్నకల్ నియోజకవర్గంలో మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు రోజు రోజుకు పెరుగుతోంది.
Also Read
బయటకు కలిసికట్టుగా ఉన్నట్లు కనిపిస్తున్నా పార్టీ కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు వర్గ విబేధాలు బయపడుతూనే ఉన్నాయి. మహబూబాబాద్, డోర్నకల్ రెండు నియోజకవర్గాల నుండి ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ టికెట్ల కోసం నలుగురు మాజీలు గట్టిగా పోటీపడుతున్నారు. ఈ నలుగురు పట్టున్న వాళ్ళే కావడంతో మానుకోట జిల్లా బీఆర్ఎస్లో నాలుగు స్తంభాలాట నడుస్తోంది. దీంతో పార్టీ శ్రేణులు కూడా విడిపోయి తమ లీడర్‌కే ఈ సారి టిక్కెట్ అంటూ చర్చలు పెట్టడమే కాకుండా ఏకంగా పందేలకు కూడా సిద్ధపడుతున్నారట. ఇన్నాళ్లు చాపకింద నీరులా కొనసాగుతూవచ్చిన గ్రూపు రాజకీయాలు కాంగ్రెస్ వెయ్యిరోజుల పాలన వైఫల్యాలపై ఆందోళన కార్యక్రమాల సందర్భంగా బయటపడ్డాయి. మహబూబాబాద్ సీటు కోసం రెండుసార్లు ప్రాతినిధ్యం వహించిన బానోత్ శంకర్‌నాయక్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు.
ఈసారి పోటీ చేసేది మనమేనంటూ పార్టీ శ్రేణుల్లో భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారాయన. మరో మాజీ ఎమ్మెల్యే మాలోత్ కవిత కూడా… మహబూబాబాద్ నియోజకవర్గంలో పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్టీ పిలుపునిచ్చే వివిధ ఆందోళన కార్యక్రమాల్లో ఆమె కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ సారి టికెట్ మనదేనని చెబుతూ క్యాడర్ జారిపోకుండా జాగ్రత్త పడుతున్నారామె. అంతా ఒక్కటేనన్నట్లు కనిపిస్తున్నప్పటికీ… కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన నిరసన కార్యక్రమాలను శంకర్‌నాయక్, మాలోత్ కవిత వేరువేరుగా నిర్వహించి ఒక రకంగా బల ప్రదర్శన చేశారన్న అభిప్రాయం ఉంది.
దీంతో… ఎటువైపు వెళ్ళాలో అర్ధంగాక కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు తలలు పట్టుకున్నారట. ఇక డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఇద్దరు మాజీలు తీవ్రంగా పోటీపడుతున్నారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం హించిన సీనియర్ రెడ్యానాయక్ వచ్చే ఎన్నికల్లో మరోసారి సీటు ఆశిస్తున్నారు. మరోవైపు ఇదే నియోజకవర్గం కోసం మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ సైతం రేస్‌లో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తనకే పార్టీ టికెట్ ఇస్తారంటూ తన వర్గాన్ని బలో పేతం చేసుకుంటున్నారామె. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో డోర్నకల్ నియోజకవర్గంలో పలు ఆందోళనలో పాలు పంచుకుంటున్నారామె. డోర్నకల్ కార్యక్రమాల్లో సత్యవతి రాథోడ్ పాల్గొనడంపై రెడ్యానాయక్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
అయితే…తాను ఆ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యేగానే కాకుండా జిల్లా ఇన్‌ఛార్జ్‌గా పార్టీ శ్రేణులకు అండగా ఉండడంలో తప్పేముందని ప్రశ్నిస్తున్నారామె. కాంగ్రెస్ వెయ్యిరోజుల పాలన వైఫల్యాలపై చేవట్టిన ఆందోళనల్లో డోర్నకల్‌లో సత్యవతి పాల్గొనడంపై రెడ్యా నాయక్ అభ్యంతరం చెప్పారు. ఫైనల్‌గా ఈ పంచాయితీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దగ్గరికి చేరిందట. కురవి మండలం పరిధిలోని తన సొంత గ్రామం పెద్దతండాలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు సత్యవతి రాథోడ్. తర్వాత కురవిలో జరిగిన బీఆర్ఎస్ నిరసన కార్యక్రమంలో కూడా రెడ్యానాయక్‌తో పాటు ఆమె కూడా పాల్గొన్నారు. దాంతో… రెడ్యా నాయక్ సీరియస్ అయిపోయి వేరే వాళ్ళ ఫోన్ నుంచి సత్యవతికి కాల్ చేసి కార్యక్రమానికి ఎందుకు వచ్చారంటూ ప్రశ్నించినట్లు తెలిసింది.
అందుకు ప్రతిగా ఆమె కూడా జిల్లా ఇన్‌ఛార్జ్‌గా ఎక్కడైనా పాల్గొనవచ్చని గట్టిగానే సమాధానం చెప్పినట్టు తెలిసింది. ఈ ఫోన్ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన సత్యవతి రాథోడ్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్ళారట. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం సందర్భంగా కేటీఆర్ మహబూబాబాద్ జిల్లా నాయకులతో గ్రూప్ రాజకీయాలపై చర్చించినట్లు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ముందు అధికార పార్టీ వైఫల్యాలను చాటి చెప్పడంలో అంతా కలిసికట్టుగా పనిచేయాలని, అసెంబ్లీ టిక్కెట్లు ఇచ్చే నాటికి అప్పటి పరిస్థితిని బట్టి ఆలోచిద్దామని, ఇప్పుడే గ్రూప్ రాజకీయాలు వద్దంటూ సున్నితంగా క్లాస్ పీకినట్లు తెలిసింది. మొత్తం మీద మహబూబాబాద్ జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గ్రూప్‌వార్ అధిష్టానానికి కూడా తలనొప్పిగా మారబోతోందంటున్నారు పొలిటికల్ పండిట్స్.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!