Site icon NTV Telugu

Off The Record: బండి సంజయ్ మాటలకు కౌంటర్‎గానే ఈటల ఆలా అన్నారా ?

Bandi

Bandi

Off The Record: తెలంగాణ కమలం లొల్లి ఇప్పట్లో కొలిక్కి రాదా? ఎడ్డెమంటే తెడ్డెమనే నైజం మారదా? జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికతో అది మరింత ముదిరిందా? ఓ వైపు డిపాజిట్‌ కూడా దక్కకుండా జనం కర్రుగాల్చి వాత పెట్టినా.. కనీసమైన మార్పు లేకుండా.. ఇప్పటికీ అవే కీచులాటలా? జూబ్లీహిల్స్‌ బైపోల్‌ కేంద్రంగా మొదలైన కొత్త గొడవ ఏంటి? దాని గురించి పార్టీ వర్గాలు ఏమంటున్నాయి?

Read Also: Andhra King Taluka Trailer: ఫ్యాన్స్‌ను ఎగతాళి చేశాడు రా.. ఆడికి మనమేంటో చూపెట్టాలి!

ఒకరేమో.. హిందువులంతా ఏకం కావాలి.. జూబ్లీహిల్స్‌లో బీజేపీ ఓటమి హిందువులకు గుణపాఠం కావాలంటూ వీర స్టేట్‌మెంట్‌ ఇచ్చేస్తారు. మరొకాయనేమో.. కులం, మతం ఆధారంగా ఎన్నికల్లో గెలవలేం, అధికారంలోకి రాలేమని ఢంకా బజాయించి చెబుతారు. ఇద్దరూ తెలంగాణ బీజేపీలో ముఖ్య నాయకులే. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావాలని కలలుగంటున్న వాళ్ళే. కానీ… ఇలా పరస్పర విరుద్ధమైన వైఖరితో వీళ్ళు కలిసి పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్తారన్నది కేడర్‌ క్వశ్చన్. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ఫలితాలను విశ్లేషించుకునే క్రమంలో పార్టీ ముఖ్య నాయకులు బండి సంజయ్‌, ఈటల రాజేందర్‌ చేసిన వ్యాఖ్యల చుట్టూ తెలంగాణ కమల దళంలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ బైపోల్‌లో బీజేపీ హిందుత్వ, జాతీయ వాదాలే ప్రధాన ఎజెండాగా ప్రచారం చేసింది. ఈ ఎన్నికల్లో అసలు పోటీ బీజేపీ, మజ్లిస్ పార్టీల మధ్యనే అని కూడా ఒక దశలో అన్నారు కాషాయ నాయకులు.

Read Also: Off The Record: అనర్హత పిటిషన్స్ పై త్వరలోనే నిర్ణయం..ఆ ఇద్దరి మీద చర్యలు ఉంటాయా ?

అసలు ఒక వర్గం ఓట్ల కోసమే ఎన్నికలకు ముందు అజారుద్దీన్‌కు కాంగ్రెస్‌ పార్టీ మంత్రి పదవి ఇచ్చిందని కూడా ఆరోపించారు బీజేపీ లీడర్స్‌. కేంద్ర మంత్రి, పార్టీ సీనియర్‌ లీడర్‌ బండి సంజయ్‌ అయితే, హిందువులారా ఏకం కండంటూ… ఎన్నికల ప్రచారంలో పిలుపునిచ్చారు. తాలా ఎగ్రెసివ్‌గా మాట్లాడారాయన. హిందువులంతా సాలిడ్‌ ఓట్‌ బ్యాంక్‌గా మారాలంటూ… మీకు ఏ రాజ్యం కావాలో తేల్చుకోండంటూ వివాదాస్పద వ్యాఖ్యలు సైతం చేశారాయన. ఆయన యాక్షన్‌, దానికి పొలిటికల్‌ రియాక్షన్స్‌ ఎలా ఉన్నా… ఓవరాల్‌గా బండి సంజయ్ మాత్రం హిందుత్వ అజెండానే ఎక్కువగా ప్రొజెక్ట్‌ చేశారు. ఆ తర్వాత కూడా అదే పాయింట్‌ మీద నిలబడి తన వాగ్ధాటిని కొనసాగిస్తున్నారాయన. కానీ… అదే పార్టీకి చెందిన మరో ఎంపీ ఈటల రాజేందర్‌ వాయిస్‌ మాత్రం మరోలా ఉంది.

Read Also:

నా వ్యక్తిగత అభిప్రాయం అంటూనే.. Tej Pratap Yadav: లాలూ, రబ్రీలను వేధిస్తున్నారు.. దర్యాప్తుకు కుమారుడి డిమాండ్..బండి సంజయ్‌ స్టేట్‌మెంట్‌కు పూర్తి భిన్నమైన మాటలు మాట్లాడారు ఈటల. డివిజన్ పాలిటిక్స్‌తో తెలంగాణలో అధికారంలోకి రాలేమని అంటున్నారాయన. వేరే రాష్ట్రాల్లో పరిస్థితులు ఎలా ఉన్నా… తెలంగాణ విషయంలో మాత్రం తనకు ఫుల్‌ క్లారిటీ ఉందని, ఇక్కడ కులం, మతం పునాదుల మీద రాజకీయాలు శాశ్వతంగా నడవవంటూ కుండ బద్దలు కొట్టేశారు రాజేంద్ర. దీంతో ఇద్దరు నాయకుల మధ్య ఉన్న గ్యాప్‌ మరోసారి బయటపడిందన్న చర్చలు నడుస్తున్నాయి పార్టీ వర్గాల్లో. సాధారణంగా పార్టీ అన్నాక చాలామంది నాయకులు ఉంటారు, ఒక్కొక్కరికి ఒక్కోరకమైన అభిప్రాయం ఉంటుంది. విభేదించుకోవడం కూడా కామన్‌. కానీ, ఇక్కడ మాత్రం వ్యవహారం తేడాగా ఉందన్నది విశ్లేషకుల మాట. ఇద్దరి మధ్య చాన్నాళ్ళ నుంచి పరోక్షంగా నడుస్తున్న యుద్ధం గురించి పార్టీ, ఇతర రాజకీయ వర్గాలకు తెలుసు కాబట్టి.. ఇప్పుడు బండి సంజయ్ వ్యాఖ్యలకు కౌంటర్‌గానే ఈటల రాజేందర్ కామెంట్స్ చేసినట్టు అంచనా వేస్తున్నారు.

Read Also: Amaravati Farmers: సీఆర్డీఏ అసిస్టెంట్ కమిషనర్తో రైతుల సమావేశం

ఇక, ఈ ఇద్దరి మధ్య సయోధ్య కుదిరే అవకాశం లేదా అని కూడా మాట్లాడుకుంటున్నారు పార్టీ నాయకులు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో పూర్తి స్థాయిలో బలపడి అధికారంలోకి రావాలని కలలుగంటోంది బీజేపీ అగ్ర నాయకత్వం. కానీ… ఒక్కటిగా నిలబడి పార్టీని నడిపించాల్సిన నేతల మధ్యనే ఈ స్థాయి విభేదాలుంటే… ఇక వీళ్ళు అధికారం దిశగా ఏం అడుగులు వేస్తారంటూ పార్టీ కేడరే పెదవి విరుస్తున్న పరిస్థితి. కలిసిక్టటుగా వైరి పక్షాలపై విరుచుకు పడుతూ…. పార్టీకి పాజిటివ్‌ వైబ్‌ తీసుకురావాల్సిన నేతలు… ఇలా పరస్పరం బాంబులు పేల్చుకుంటున్నారంటూ కార్యకర్తల్లో అసహనం వ్యక్తం అవుతోంది. పార్టీలో జరుగుతున్న ఈ పంచాయితీలకు ఫుల్‌స్టాప్‌ పెట్టకుంటే… వచ్చే ఎన్నికల్లో అధికారం సంగతి తర్వాత…ఉన్న బలం కూడా పోతుందంటూ వార్నింగ్స్‌ ఇస్తోంది కేడర్‌.

Exit mobile version