ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన సినిమా ‘ఆంధ్రా కింగ్ తాలూకా’. దర్శకుడు పి. మహేశ్‌బాబు తెరకెక్కించిన ఈ సినిమాలో యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించారు. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా నవంబర్ 27న థియేటర్లలోకి రానుంది. రిలీజ్‌కు కొన్ని రోజులే ఉన్న నేపథ్యంలో ఈరోజు కర్నూలులోని ఔట్‌డోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన గ్రాండ్ ఈవెంట్‌లో ట్రైలర్‌ను విడుదల చేశారు.
Also Read: Maanya Anand: కమిట్‌మెంట్ ఇవ్వమని వెంటపడ్డాడు.. హీరో ధనుష్ మేనేజర్‌పై నటి షాకింగ్ కామెంట్స్!
‘ఎల్లండి, ఎల్లండి, ఎల్లండి.. 10 నిమిషాల్లో ఆట మొదలయిపోతుంది’ అనే డైలాగ్‌తో ఆంధ్రా కింగ్ తాలూకా ట్రైలర్ మొదలైంది. ‘నా కథకి ఆయనే హీరో’, ‘నువ్ ఇంతే. ఇక నీ బతుకింతే’, ‘ఫ్యాన్స్‌ను ఎగతాళి చేశాడు రా.. ఆడికి మనమేంటో చూపెట్టాలి’ అనే డైలాగ్స్ అభిమానులని ఆకట్టుకుంటున్నాయి. హీరో అభిమాని జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజైన ఆంధ్రా కింగ్ తాలూకా టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు.