Theatre Crisis: అసలు థియేటర్లో రెంట్, పర్సంటేజ్ బేసిస్ అంటే ఏంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్‌లో ఇప్పుడు ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. థియేటర్ రెంటల్ లేదా పర్సంటేజ్ వ్యవహారం మీద చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రెండు రకాలుగా సినిమాలు రిలీజ్ చేస్తూ వచ్చారు. పెద్ద సినిమాలైతే రెంటల్ పద్ధతిలో, చిన్న సినిమాలు లేదా క్రేజ్ లేని సినిమాలైతే పర్సంటేజ్ పద్ధతిలో రిలీజ్ చేస్తూ వచ్చారు. కాకపోతే, మల్టీప్లెక్స్‌లలో మాత్రం ఏ సినిమా అయినా పర్సంటేజ్ ప్రకారమే రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో సింగిల్ స్క్రీన్ థియేటర్ ఓనర్లు అందరూ కలిసి, తమకు ప్రతి సినిమా పర్సంటేజ్ పద్ధతిలోనే కావాలని డిమాండ్ తెరమీదకు తెచ్చారు.
Also Read:Jailer 2 : జైలర్-2లో ఆ కాంట్రవర్సీ యాక్టర్..?
Also Read
అయితే, రెంటల్ పద్ధతి ఏంటి, పర్సంటేజ్ పద్ధతి ఏంటి అనేది చాలామందికి అవగాహన లేదు. రెంటల్ పద్ధతి విషయానికి వస్తే, సింగిల్ స్క్రీన్ థియేటర్ ఓనర్ కేవలం వేరే వారి సినిమాకు తన సొంత థియేటర్‌ను అద్దెకు ఇవ్వాల్సి ఉంటుంది. ఎలా అయితే పెళ్లి జరుపుకునేందుకు ఒక పెళ్లి మండపాన్ని అద్దెకు ఇస్తారో, అలా థియేటర్‌ను అద్దెకు ఇవ్వడం జరుగుతుంది. అదే పర్సంటేజ్ పద్ధతి విషయానికి వస్తే, సినిమా టికెట్ల అమ్మకం జరిగిన తర్వాత ఎన్ని టికెట్లు అమ్ముడయ్యాయో లెక్కలు తీసి, అందులో కొంత పర్సంటేజ్ ఎగ్జిబిటర్‌కు, మరికొంత డిస్ట్రిబ్యూటర్ ద్వారా నిర్మాతకు చేరేలా అగ్రిమెంట్లు రాసుకుంటారు.
Also Read:Andhra King Taluka: ఆంధ్రా కింగ్ బరిలోకి దిగాడు!
ఇప్పటివరకు జరుగుతున్న పద్ధతి ఏంటంటే, పెద్ద సినిమాలన్నీ రెంటల్ పద్ధతిలోనే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇలా చేస్తున్నప్పుడు తాము నష్టపోతున్నామని సింగిల్ స్క్రీన్ థియేటర్ ఓనర్లు వాపోతున్నారు. ఎందుకంటే, చిన్న సినిమాలను పర్సంటేజ్ లెక్కలో రిలీజ్ చేస్తున్నప్పటికీ అవి తమకు ఇబ్బందిగానే ఉన్నాయని, అదే పెద్ద సినిమాలను రెంటల్ పద్ధతిలో కాకుండా పర్సంటేజ్ లెక్కలో రిలీజ్ చేస్తే తాము కూడా కొంత లాభం పొందవచ్చని వారు చెబుతున్నారు. అయితే, ఇలా చేయడం రిస్క్ అని కొందరు పెద్ద నిర్మాతలు భావిస్తున్నారు.
నిజానికి రెండు పద్ధతుల్లోనూ కొన్ని లాభాలు, కొన్ని నష్టాలు ఉన్నాయి. కానీ సింగిల్ స్క్రీన్ థియేటర్ ఓనర్లు ఇకపై పర్సంటేజ్ విధానమే కావాలని పట్టుబడుతున్నారు. ఈ పట్టుదలకు కారణం కొందరు నిర్మాతలపై ఆరోపణలు ఉన్నాయనే ప్రచారం రూపొందుతోంది. ఈ ప్రచారం ఇప్పుడు పెద్దదై, ఏకంగా ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించే స్థాయికి చేరింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రిటర్న్ గిఫ్ట్ అంటూ సినీ పరిశ్రమపై ఫైర్ అయిన పరిస్థితి తలెత్తింది.
తాజావార్తలు
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనయోగం!
-
Drishyam 3 : దృశ్యం3తో అజయ్ దేవగన్ సాలిడ్ కంబ్యాక్.. రూ. 230 కోట్లు క్రాస్ చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్
-
PNB Loan Interest Rate Hike: PNB, బ్యాంక్ ఆఫ్ బరోడా సహా పలు బ్యాంకుల్లో లోన్లు భారం.. కొత్త వడ్డీ రేట్లు ఇవే
ట్రెండింగ్
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!