టాలీవుడ్‌లో ఇప్పుడు ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. థియేటర్ రెంటల్ లేదా పర్సంటేజ్ వ్యవహారం మీద చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రెండు రకాలుగా సినిమాలు రిలీజ్ చేస్తూ వచ్చారు. పెద్ద సినిమాలైతే రెంటల్ పద్ధతిలో, చిన్న సినిమాలు లేదా క్రేజ్ లేని సినిమాలైతే పర్సంటేజ్ పద్ధతిలో రిలీజ్ చేస్తూ వచ్చారు. కాకపోతే, మల్టీప్లెక్స్‌లలో మాత్రం ఏ సినిమా అయినా పర్సంటేజ్ ప్రకారమే రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో సింగిల్ స్క్రీన్ థియేటర్ ఓనర్లు…