ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న యూనిక్ ఎంటర్‌టైనర్ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ చిత్రానికి మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. రామ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టైటిల్ గ్లింప్స్ అద్భుతమైన స్పందనను రాబట్టింది. ఈ గ్లింప్స్‌లో సినిమాపై అమితమైన ఇష్టం ఉన్న యువకుడిగా రామ్ పోతినేని పాత్ర ప్రేక్షకులను కట్టిపడేసింది. గ్లింప్స్‌లో కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర భారీ కటౌట్ రూపంలో కనిపించి మరింత ఆకర్షణను సృష్టించారు.
Also Read: Varun Tej: కొరియా బయలుదేరుతున్న వరుణ్ తేజ్
ఈ చిత్రంలో ఉపేంద్ర పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఇటీవల విడుదలైన ఆయన క్యారెక్టర్ పోస్టర్ భారీ బజ్‌ను సృష్టించింది. పాత్రల ఎంపికలో ఎప్పుడూ ప్రత్యేకతను ఇష్టపడే ఉపేంద్ర, హైదరాబాద్‌లో జరుగుతున్న షెడ్యూల్‌లో ఇటీవల చేరారు. ఆయన ఈ సినిమాలో సూపర్ స్టార్ సూర్యకుమార్ పాత్రలో కనిపించనున్నారు. రామ్ సరసన భాగ్యశ్రీ బోర్స్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం, అద్భుతమైన తారాగణం, ఆసక్తికరమైన కథాంశంతో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది.