Jailer 2 : సూపర్ స్టార్ రజినీకాంత్ రజినీకాంత్ నటిస్తున్న మోస్ట్ హైప్ ఉన్న మూవీ జైలర్-2. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మొదటి పార్టు భారీ హిట్ అయింది. కాబట్టి రెండో పార్టు కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. నెల్సన్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై తాజాగా ఓ న్యూస్ వినిపిస్తోంది. ఇందులో వివాదాస్పద నటుడు వినాయకన్ నటిస్తున్నాడంట. ఈయన ఫస్ట్ పార్టులో విలన్ గా చేసి అందరినీ మెప్పించాడు. కానీ ఈ సినిమా తర్వాత ఆయన వరుసగా వివాదాల్లో చిక్కుకున్నారు. ఆయన పలుమార్లు మద్యం తాగి గొడవలు పడి కేసుల్లో ఇరుక్కున్నాడు.
Read Also : Varun Tej: కొరియా బయలుదేరుతున్న వరుణ్ తేజ్
అతన్ని జైలర్-2లో రెండు నిముషాల పాత్ర కోసం తీసుకున్నారంట. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సీన్ లో మళ్లీ విలన్ గా కనిపించబోతున్నాడంట. కాకపోతే ఎక్కువ సమయం ఉండకపోవచ్చు. కేవలం రెండు నిముషాలు మాత్రమే ఉండే ఛాన్స్ ఉంది. కాకపోతే అతన్ని తీసుకుంటే సినిమాపై ఏమైనా నెగెటివిటీ వస్తుందేమో అని రజినీ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. జైలర్ సినిమాతో ఆయనకు భారీ క్రేజ్ వచ్చింది. కానీ దాన్ని కాపాడుకోవడంలో ఆయన విఫలం అయ్యారు. అదే ఆయనకు అవకాశాలను దూరం చేస్తోందని తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
Read Also : Mysuru Suicide: ప్రియుడితో వెళ్లిపోయిన కూతురు.. చెరువులో దూకి కుటుంబం ఆత్మహత్య..