జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వరుస సినిమాలు చేస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చివరిగా ఆయన నటించిన దేవర సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌తో కలిసి వార్ 2 సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.
Also Read: OTT Movie : ఓటీటీలోకి ‘DD నెక్స్ట్ లెవల్’.. ఎక్కడ చూడాలంటే?
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాకి సంబంధించిన డబ్బింగ్‌ను కూడా పూర్తి చేశాడు. ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్‌లో ఆయన బిజీగా ఉన్నాడు. ఇక ఇప్పుడు త్రివిక్రమ్‌తో సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం మొదలైంది. ఈ విషయాన్ని నిర్మాత నాగ వంశీ కూడా పరోక్షంగా హింట్ ఇచ్చాడు. అయితే, త్రివిక్రమ్ సినిమాకి జూనియర్ ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మాట నిజమే అయినప్పటికీ, ఈ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కే అవకాశం లేదు.
Also Read: OTT Movie: ఓటీటీకి మర్డర్ మిస్టరీ సినిమా.. ఎందులో చూడాలంటే?
ఎందుకంటే, ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ముందుగా ప్రశాంత్ నీల్ సినిమాను పూర్తి చేయాల్సి ఉంది. ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో దేవర 2 సినిమాను పూర్తి చేయాల్సి ఉంది. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత, నాగ వంశీ నిర్మాణంలో నెల్సన్ దర్శకత్వంలో మరో సినిమా చేయాల్సి ఉంది. ఆ సినిమా పూర్తయిన తర్వాతే త్రివిక్రమ్‌తో జూనియర్ ఎన్టీఆర్ సినిమా చేసే అవకాశం ఉంది. కాబట్టి, అప్పటివరకు ఎన్ని సంవత్సరాలు పడుతుందో చెప్పలేని పరిస్థితి.