నెల గ్యాప్ లో టాలీవుడ్ బడా హీరోల టీజర్లు మూడు వచ్చాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది, ఎన్టీఆర్ నటించిన వార్-2, ప్రభాస్ నటించిన రాజాసాబ్ టీజర్లు ప్రస్తుతానికి రిలీజ్ అయ్యాయి. పాన్ ఇండియా స్టార్లుగా పోటీ పడుతున్న ఈ ముగ్గురి సినిమా టీజర్ల గురించే ఇప్పుడు చర్చంతా. దేని ఇంపాక్ట్ ఎక్కువ.. ఏది ఎక్కువ రెస్పాన్స్ దక్కించుకుంది.. ఏది ఎక్కువ వ్యూస్ సాధించింది అని.
పెద్ది
గేమ్ ఛేంజర్ లాంటి డిజాస్టర్ తర్వాత రామ్ చరణ్ భారీ అంచనాలతో బుచ్చిబాబుతో చేస్తున్నాడు. పెద్ది మూవీ ఫస్ట్ షాట్ పేరుతో రిలీజ్ చేసిన టీజర్ ఐపీఎల్ టైమ్ లో వచ్చింది. ఆ క్రికెట్ షాట్ ఐపీఎల్ ను ఊపేసింది. పైగా రంగస్థలం పోలికలు కనిపించాయి. ఉత్తరాంధ్ర విలేజ్ బ్యాక్ డ్రాప్, చరణ్ లుక్స్ అన్నీ పాజిటివ్ వైబ్ ను క్రియేట్ చేశాయి. రిలీజ్ అయిన 24 గంటల్లోనే 30.8 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.
Read Also : Anupama Parameshwaran : యాక్టింగ్ రాదని అవమానించారు.. అనుపమ షాకింగ్ కామెంట్స్
వార్-2
24 గంటల్లో వార్-2 టీజర్ వ్యూస్ మిక్స్ డ్ గా వచ్చాయి. ఎన్టీఆర్ ఉన్నాడంటే తెలుగులో భారీ వ్యూస్ రావాలి. కానీ మరీ దారుణంగా మొదటి 24 గంటల్లో తెలుగులో 4 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అదే ఇండియా వైడ్ గా 70 మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది ఈ టీజర్. తెలుగు ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. హృతిక్ ను హైలెట్ చేస్తూ ఎన్టీఆర్ ను తక్కువ చేసి చూపించారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ఆ మూవీకి అంతగా తెలుగులో రెస్పాన్స్ రాలేదు. వార్-2లో హృతిక్ రోషన్ తో పాటు ఎన్టీఆర్ పోలీస్ ఆఫీసర్ పాత్రల్లోనే నటించారు. యాక్షన్ సీన్లు, నేషనల్ సెంటిమెంట్ లాంటివి ఇందులో చూపించారు. ఎన్టీఆర్, హీతిక్ మధ్య ఫైట్ సీన్ కూడా హైలెట్ అయింది. నార్మల్ ఆడియెన్స్ కు టీజర్ బాగా నచ్చింది. కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం నిరాశకు గురయ్యారు. తమ హీరోను తక్కువ చేసి చూపించడం ఏంటని మండిపడ్డారు.
రాజాసాబ్
ఇక తాజాగా ప్రభాస్ నటించిన రాజాసాబ్ టీజర్ వచ్చింది. ఇందులో ప్రభాస్ వింటేజ్ లుక్స్, హర్రర్ వీఎఫ్ ఎక్స్, లొకేషన్, సెట్స్ రచ్చ లేపాయి. చాలా పెద్ద డైరెక్టర్ల సినిమాల వీఎఫ్ ఎక్స్ కంటే ఈ మూవీ వీఎఫ్ ఎక్స్ బాగుందంటూ ప్రశంసలు వచ్చాయి. పైగా ప్రభాస్ ఫస్ట్ టైమ్ హర్రర్ కామెడీ సినిమాలో చేస్తున్నాడు. అందుకే టీజర్ కు డీసెంట్ రెస్పాన్స్ వచ్చింది. అన్ని భాషల్లో, ప్లాట్ ఫామ్స్ కలిపి 24 గంటల్లో ఏకంగా 59 మిలియన్ డిజిటల్ వ్యూస్ వచ్చాయి.
అయితే ఈ మూడు టీజర్లలో వ్యూస్ పరంగా చూస్తే వార్-2 ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. ఆ తర్వాత రాజాసాబ్, మూడో ప్లేస్ లో పెద్ది ఉంటాయి. కానీ బజ్ పరంగా అయితే ముందు వరుసలో పెద్ది, తరువాత రాజాసాబ్ ఆ తరువాత వార్ – 2 సినిమాలు నిలుస్తున్నాయి. అయితే ఇది టీజర్ ఇంపాక్ట్. కానీ ఇప్పుడే ఏ సినిమానూ తక్కువ అంచనా వేయలేం. దేని ఇంపాక్ట్ దానిదే. పైగా ఆయా టీజర్లు రిలీజ్ అయ్యే సందర్భాన్ని బట్టి కూడా వ్యూస్ వస్తాయి. కొన్ని సార్లు టీజర్ కు భారీ వ్యూస్ వచ్చినా సినిమాలు ఆడవు.
ఇంకొన్ని సార్లు పెద్దగా టీజర్ వ్యూస్ రానివి సినిమా కలెక్షన్లలో దుమ్ములేపుతాయి. ఏదైనా కంటెంట్ మీదనే ఆధారపడి ఉంటుంది. ఈ మూడు సినిమాల జానర్స్ చాలా డిఫరెంట్. ఒకటి హర్రర్, ఇంకోటి వార్, మూడోది విలేజ్ బ్యాక్ డ్రాప్. దేనికదే స్పెషాలిటీ. ఇంపాక్ట్ పరంగా చూస్తే పెద్ది షాట్ నేషనల్ వైడ్ గా వైరల్ అయింది. ఎందుకంటే అది ఐపీఎల్ సీజన్ టైమ్. వార్-2 నార్త్ ఇండియాను ఊపేసింది. అది దాని స్పెషాలిటీ. ఇప్పుడు రాజాసాబ్ తెలుగు నాట రచ్చలేపింది. కాబట్టి ఏది ఎక్కువ, ఏది తక్కువ అని ఇప్పుడే చెప్పలేం. సినిమాలు రిలీజ్ అయ్యాక ఏ మూవీ దమ్ము ఎంత అనేది బయటపడుతుంది.
Read Also : Thug Life : థగ్ లైఫ్ కన్నడలో రిలీజ్ చేయాల్సిందే.. సుప్రీంకోర్టు ఆర్డర్..