Thug Life : తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ కు భారీ ఊరట లభించింది. మూవీని కన్నడలో రిలీజ్ చేయాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించింది. మణిరత్నం డైరెక్షన్ లో వచ్చిన థగ్ లైఫ్ మూవీ రిలీజ్ సమయంలో కన్నడ భాషపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. కమల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసినా ఆయన చెప్పలేదు. దాంతో థగ్ లైఫ్ ను కన్నడలో రిలీజ్ చేయనివ్వం అంటూ కన్నడ సంఘాలు, కన్నడ ఇండస్ట్రీ తేల్చేయడంతో కర్ణాటకలో రిలీజ్ చేయలేదు.
Read Also : Ashu Reddy : అషురెడ్డి అందాల విందు.. చూసేందుకు భలే కనివిందు
ఇదే విషయంపై మూవీ టీమ్ సుప్రీంకోర్టుకు వెళ్లగా.. తాజాగా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ‘కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలతో విభేదించే హక్కు కన్నడ ప్రజలకు ఉంది. కానీ సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చిన మూవీని అడ్డుకునే హక్కు లేదు. మూవీని చూడాలా వద్దా అనేది ప్రేక్షకుల ఇష్టం. అంతే గానీ థియేటర్లను తగలబెడుదాం అనడం కరెక్ట్ కాదు’ అంటూ కోర్టు హెచ్చరించింది.
కానీ థగ్ లైఫ్ ఆల్రెడీ మిగతా రాష్ట్రాల్లో రిలీజ్ అయి అట్టర్ ప్లాప్ అయింది. ఆ సినిమాపై భారీ నెగెటివ్ ట్రోల్స్ కూడా వచ్చాయి. అలాంటప్పుడు కన్నడలో రిలీజ్ చేసినా ఆదరణ వస్తుందనే నమ్మకం లేదు. అసలే కన్నడ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి వారు చూస్తారనే నమ్మకం అసలే లేదు. కాబట్టి కన్నడలో రిలీజ్ చేసినా పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు అంటున్నారు నెటిజన్లు.
Read Also : Pooja Hegde : చీరలో అందంగా మెరిసిపోతున్న బుట్టబొమ్మ..