నాని హీరోగా శైలేష్ కొలను డైరెక్షన్‌లో హిట్ థర్డ్ కేస్ రూపొందింది. గతంలో రూపొందిన హిట్ వన్, హిట్ టూ చిత్రాలకు సీక్వెల్‌గా ఈ సినిమాని రూపొందించారు. నాని స్వయంగా నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకి మరో నిర్మాతగా ప్రశాంతి త్రిపురనేని వ్యవహరించారు. అయితే, ఈ సినిమా మే ఒకటో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సంపాదించడమే కాక, కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. ఏకంగా రెండు రోజుల్లో 60 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా 100 కోట్ల మార్కు దిశగా పరుగులు పెడుతోంది.
Read More: Nani : హిట్-3 రెండు రోజుల కలెక్షన్స్ ఇవే..
ఇదిలా ఉండగా, ఈ సినిమాలో ఒక పెద్ద లాజిక్ శైలేష్ మిస్ అయ్యాడని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అదేమిటంటే, సినిమా కథలో భాగంగా నాని తన ఐడెంటిటీని బయటపెట్టకుండా ఒక సైకోల ముఠాలో ఎంటర్ అవ్వాల్సి వస్తుంది. అలాంటి సమయంలో నాని ఒక ఎస్‌బీఐ ఉండి, అతని ఐడెంటిటీ రివీల్ కాకుండా ఎలా ఉంటుంది అనే లాజిక్‌ను చాలామంది ప్రశ్నించారు. దానికి తోడు, ఎన్నో జాగ్రత్తలు తీసుకునే సైకోల ముఠా నానిని అంత త్వరగా ఎలా యాక్సెప్ట్ చేయగలిగింది అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి.
Read More:Janulyri : జానులిరి, నేను పెళ్లి చేసుకుంటున్నాం.. దిలీప్ దేవ్ గన్ క్లారిటీ..
అయితే, తాజాగా మీడియాతో ముచ్చటించిన సందర్భంగా ఈ విషయంపై శైలేష్ స్పందించాడు. నాని పనిచేసేది హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్, అంటే అది రెగ్యులర్ పోలీస్ టీమ్ కాదని, పోలీసుల వల్ల కానీ కేసులను సాల్వ్ చేసే డిపార్ట్‌మెంట్ అని చెప్పుకొచ్చాడు. అలాంటి డిపార్ట్‌మెంట్‌కు చెందిన అధికారులు ఎవరూ తమ ఐడెంటిటీని బయటపెట్టరని, అందుకే నాని సైకోల ముఠాలో తన సొంత ఐడెంటిటీతోనే ఎంటర్ అయ్యే అవకాశం వచ్చిందని అన్నారు. “అక్కడ నేను లాజిక్ మిస్ అయ్యానని చాలామంది అనుకుంటున్నారు, కానీ అది నిజం కాదు” అని ఈ సందర్భంగా శైలేష్ చెప్పుకొచ్చాడు.