Janulyri : ప్రముఖ ఫోక్ డ్యాన్సర్ జానులిరి గురించి ఈ నడుమ ఓ విషయం బాగా వైరల్ అవుతోంది. యూట్యూబర్, ఫోక్ సింగర్ అయిన దిలీప్ దేవ్ గన్ తో ప్రేమలో ఉందని.. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. కొన్ని రకాల ట్రోల్స్, మీమ్స్ కూడా వచ్చాయి. దీంతో జానులిరి తీవ్ర ఆవేదనతో వీడియో చేసింది. తనపై ట్రోల్స్ తట్టుకోలేకపోతున్నానని.. చనిపోవాలని ఉందంటూ వీడియోలో ఏడ్చేసింది. ఆ వీడియో సంచలనం రేపుతున్న క్రమంలోనే.. దిలీప్ దేవ్ గన్ వీడియో రిలీజ్ చేశాడు. ‘మీరందరూ అనుకున్నట్టు నేను, జానులిరి పెళ్లి చేసుకోబోతున్నాం. రీసెంట్ గా నేను పెట్టిన పోస్టులో ఉన్నది జానులిరినే’ అంటూ తెలిపాడు దిలీప్.
Read Also : UP : కారును హెలికాప్టర్ చేసేశాడు.. పోలీసులు దాన్ని ఏం చేశారంటే..? (వీడియో)
‘మేం ఎలాంటి తప్పు చేయలేదు. మనస్ఫర్తిగా కలిసి ఉండాలని నిర్ణయించుకున్నాం. అందుకే పెళ్లి చేసుకోబోతున్నాం. త్వరలోనే మా పెళ్లి జరుగుతుంది. మా ఇంట్లో ఒప్పుకున్నారు. వాళ్ల ఇంట్లో కూడా ఒప్పుకున్నారు. మీరు మమ్మల్ని ఎంత ట్రోల్స్, మీమ్స్ చేసినా తట్టుకునే శక్తి మాకు ఉంది. మీ అందరి సపోర్ట్ మాకు ఉంటుందని కోరుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు దిలీప్. ఇంకేముంది ఈ వీడియో క్షణాల్లోనే వైరల్ అయిపోతోంది. ఫోక్ ఇండస్ట్రీలో జానులిరి ఎంత ఫేమస్సో.. దిలీప్ కూడా అంతే ఫేమస్. డ్యాన్సర్ గా జానులిరి, సింగర్ గా దిలీప్ చాలా ఫేమస్. దిలీప్ ఛానెల్ లో జానులిరి కొన్ని ఫోక్ సాంగ్స్ కూడా చేసింది.
అప్పటి నుంచే వీరిద్దరి మధ్య పరిచయం పెరిగి ప్రేమగా మారిందని తెలుస్తోంది. రీసెంట్ గా దిలీప్ ఓ సంచలన పోస్టు పెట్టాడు. అతను ఓ అమ్మాయితో క్లోజ్ గా ఉన్న పిక్ పోస్టు చేశాడు. కానీ అందులో ఆమె ముఖం కనిపించలేదు. అయితే ఆమె జానులిరినే అని అందరూ కనిపెట్టేశారు. అప్పటి నుంచే ఈ రూమర్లు ఎక్కువయ్యాయి. మొత్తానికి వీరిద్దరూ ఒక్కటి అవుతుండటం పెద్ద సంచలనమే రేపుతోంది.
Read Also : Bunny Vasu : ఇప్పటికే ఉన్న పొగ చాలు.. ఇంకా కొత్తవి ఎందుకు?