Nani : నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ హిట్-3. మే 1న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతోంది. హిట్ సిరీస్ లో భాగంగా వచ్చిన ఈ మూవీని శైలేష్ కొలను డైరెక్ట్ చేశాడు. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. నాని స్వయంగా నిర్మించిన ఈ సినిమా మొదటి రోజు రూ.43 కోట్లు వసూలు చేసింది. ఇందులో నాని మోస్ట్ వైలెంటిక్ పాత్రలో నటించాడు. ఇప్పటి వరకు క్లాస్ పాత్రల్లో నటించిన నాని.. మొదటిసారి ఇంత వైలెన్స్ ఉన్న పాత్రలో చేశాడు. మాస్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది ఈ సినిమా. ఇక రెండో రోజు కూడా బాగానే వసూళ్లు సాధించింది.
Read Also : Haryana: నాకు వరకట్నం వద్దు.. రూ.31 లక్షలు తిరిగి ఇచ్చేసిన వరుడు!
ఈ మూవీ రెండు రోజుల్లో కలిపి రూ.62 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు వీకెండ్ ఆదివారం కలెక్షన్లు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. పైగా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి. పెద్ద సినిమాలు కూడా పెద్దగా లేవు. రెట్రోకు ప్లాప్ టాక్ వచ్చింది. ఇవన్నీ హిట్-3కి కలిసొచ్చే అంశాలు. అందుకే ఈ సినిమా ఈ వారంలో మరింత దూసుకుపోయే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు సినిమా మీద మంచి టాక్ నడుస్తోంది. పాన్ ఇండియా వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా అన్ని భాషల్లో మంచి టాక్ సంపాదించుకుంది. నాని నిర్మాతగా మరో హిట్ అందుకున్నాడు.
Read Also : Janulyri : జానులిరి, నేను పెళ్లి చేసుకుంటున్నాం.. దిలీప్ దేవ్ గన్ క్లారిటీ..