తాజాగా జరిగిన రాబిన్ హుడ్ సినిమా ఈవెంట్లో రాజేంద్రప్రసాద్ డేవిడ్ వార్నర్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. నితిన్ హీరోగా శ్రీ లీల హీరోయిన్గా రాబిన్ హుడ్ అనే సినిమా రూపొందింది. ఈ సినిమాని ఛలో, భీష్మ లాంటి సినిమాలు డైరెక్ట్ చేసిన వెంకీ కుడుముల డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాలో ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఒక అతిధి పాత్రలో కనిపించాడు. ఈ నేపథ్యంలోనే ఆయననే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఇక ఈ నేపథ్యంలో నటుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ డేవిడ్ వార్నర్ ఒక దొంగ ముండాకొడుకు అంటూ కామెంట్ చేశారు. క్రికెట్ ఆడమంటే పుష్ప లాగా బుజం పెట్టి రీల్స్ చేశాడనిz డేవిడ్ వార్నరు ఇదేనా వార్నింగ్ అంటూ కామెంట్ చేశారు.
Betting Apps: షారుఖ్‌ఖాన్, సచిన్, కోహ్లీలపై పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు ?
రాజేంద్రప్రసాద్ లాంటి సీనియర్ నటుడు ఇంటర్నేషనల్ సెలబ్రిటీ అయిన డేవిడ్ వార్నర్ను ఉద్దేశించి మాట్లాడడం కరెక్ట్ కాదంటూ సోషల్ మీడియాలో నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు. అయితే ఇదే విషయాన్ని తెలిసిన తర్వాత డేవిడ్ వార్నర్ ఎలా స్పందించాడు అనే విషయం మీద దర్శకుడు వెంకీ కుడుముల క్లారిటీ ఇచ్చారు. ఈరోజు మధ్యాహ్నం ప్రింట్- వెబ్ మీడియా ప్రతినిధులతో వెంకీ కుడుముల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు ఈ అంశం గురించి ప్రశ్న ఎదురయింది. రాజేంద్రప్రసాద్ లాంటి నటుడు పెద్ద తరహాలో అలా మాట్లాడి ఉండవచ్చు ఇదే విషయాన్ని నేను డేవిడ్ వార్నర్ దృష్టికి కూడా తీసుకువెళ్లాను ఆయన ఇలా అన్నారు కానీ నువ్వేమీ ఫీల్ కావొద్దు ఆయన తప్పుడు ఉద్దేశంతో అనలేదు అని నేను ఆయనకు చెప్పాను. దీంతో డేవిడ్ వార్నర్ చాలా కూల్ గా ఆయన కూల్ పర్సన్ నేను క్రికెట్లో స్లెడ్జింగ్ చూశాను ఇది యాక్టింగ్ లో స్లెడ్జింగ్ లా ఫీల్ అవుతాను అంత పెద్దాయన సరదాగానే అని ఉంటారు అని అభిప్రాయబడినట్లు వెంకీ కుడుముల చెప్పుకొచ్చారు.