Woman Zomato delivery executive riding bike Goes Viral: ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ ‘జొమాటో’కు డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లుగా పురుషులే పని చేస్తుంటారు. సాధారణంగా మనం రోడ్లపై ఎక్కువగా అబ్బాయిలనే చూస్తుంటాం. రాత్రైనా, పగలైనా కస్టమర్లకు వారు ఫుడ్ డెలివరీ చేస్తుంటారు. అయితే తాజాగా జొమాటో డెలివరీ ఎగ్జిక్యూటివ్‌గా ఓ హాట్ లేడీ కనిపించింది. బిజీ రోడ్డుపై జొమాటో బాగ్ వేసుకుని బైక్‌పై వెళుతున్న ఓ అమ్మాయికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఓ లేడీ ఎరుపు రంగు టీ-షర్ట్, షార్ట్ ధరించి జొమాటో డెలివరీ బ్యాగ్‌తో బైక్‌పై ఇండోర్ నగరంలో చక్కర్లు కొట్టింది. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆమె ఆగగానే.. అందరూ ఆమె వైపు చూసి షాక్ అయ్యారు. పక్కన వారిని చూసి ఆ లేడీ కూడా నవ్వులు పూయించింది. రాజీవ్ మెహతా (Rajiv Mehta) అనే ఎక్స్ ఖాతాలో ఇందుకు సంబదించిన వీడియో పోస్ట్ చేశారు. ‘ఇండోర్ జొమాటో మార్కెటింగ్ హెడ్‌కి ఈ ఆలోచన వచ్చింది. ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంట ఖాళీ జొమాటో బ్యాగ్‌తో తిరిగేందుకు ఒక మోడల్‌ను నియమించుకున్నాడు. జొమాటో దూసుకుపోతుంది’ అని రాసుకొచ్చాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవింగ్ ఏంటి? అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Same Gender Marriage: స్వలింగ సంపర్కుల వివాహాలపై సుప్రీంకోర్టు తీర్పు.. నాలుగు వేర్వేరు తీర్పులు..!
ఈ వీడియోపై జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ స్పందించారు. ఈ వీడియోతో కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని, ఆమె తమ ఉద్యోగిని కాదని స్పష్టం చేశారు. ‘దీనితో మాకు ఎలాంటి సంబంధం లేదు. మేము హెల్మెట్ లేని డ్రైవింగ్‌ను ఎంకరేజ్ చెయ్యం. మాకు ఇండోర్ మార్కెటింగ్ హెడ్ లేరు. మా బ్రాండ్‌పై ఎవరో ఫ్రీ-రైడింగ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఒకటి చెప్పాలి.. మహిళలు ఆహారాన్ని పంపిణీ చేయడంలో తప్పు లేదు. కుటుంబ జీవనోపాధి కోసం ప్రతిరోజూ ఆహారాన్ని పంపిణీ చేసే వందలాది మంది మహిళలు ఉన్నారు. వారి పని పట్ల మేము గర్విస్తున్నాము’ అని గోయల్ పేర్కొన్నారు.
Hey! We had absolutely nothing to do with this.
We don’t endorse helmet-less biking. Also, we don’t have a “Indore Marketing Head”.
This seems to be someone just “free-riding” on our brand. Having said that, there’s nothing wrong with women delivering food – we have hundreds… https://t.co/xxNPU7vU8L
— Deepinder Goyal (@deepigoyal) October 17, 2023