Salman Khan: విరాట్ ‘దబాంగ్’, రోహిత్ ‘బజరంగీ భాయిజాన్’.. సల్మాన్ ఖాన్ ఫిదా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Salman Khan Says Virat Kohli is Dabangg and Rohit Sharma is Bajrangi Bhaijaan: ప్రపంచకప్ 2023లో భారత్ దూసుకుపోతుంది. మెగా టోర్నీలో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో గెలిచిన టీమిండియా (6 పాయింట్స్) టాప్ ప్లేస్‌లో ఉంది. భారత్ తన తదుపరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ధి కొడుతుంది. భారత ఆటగాళ్ల ఫామ్ చూస్తే.. ఈ మ్యాచ్ కూడా సునాయాసంగా గెలవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రపంచకప్ 2023లో భారత్ అన్ని విభాగాల్లో రాణిస్తూ విజయాలు సాధిస్తోంది. ముఖ్యంగా బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు సత్తాచాటుతున్నారు. ఈ ఇద్దరి ఆటకు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఫిదా అయ్యాడు. దబాంగ్, భజరంగి భాయిజాన్ క్యారెక్టర్లు వారికి సరిగ్గా నప్పుతాయని పేర్కొన్నాడు.
స్టార్ స్పోర్ట్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రపంచకప్ 2023లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల ప్రదర్శనల గురించి సల్మాన్ ఖాన్ స్పందించాడు. ఈ క్రమంలో ఈ ఇద్దరు మీ సినిమాల్లోని ఏ క్యారెక్టర్‌కు సూట్ అవుతారని యాంకర్ అడగ్గా.. విరాట్ ‘దబాంగ్’, రోహిత్ ‘బజరంగీ భాయిజాన్’ క్యారెక్టర్‌కు సెట్ అవుతారని చెప్పాడు. ‘విరాట్ కోహ్లీ శారీరకంగా, మానసికంగా చాలా దృఢంగా ఉంటాడు. అతను చాలా అంకితభావంతో ఆడతాడు. కోహ్లీ తన పనిని సీరియస్‌గా తీసుకుంటాడు. జట్టులో తన రోల్ ఏంటో కోహ్లీకి బాగా తెలుసు. తన పనిని సమర్థవంతంగా నిర్వర్తించడానికి చాలా కష్టపడతాడు’ అని సల్లూ భాయ్ అన్నాడు.
Also Read
- ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
- Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
- Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్‌గా రైలు టికెట్లు బుకింగ్
- Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
Also Read: Mohan Lal: వంద రోజుల్లో లాల్ నుంచి పాన్ ఇండియా సినిమా…
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఏ క్యారెక్టర్‌కు సూట్ అవుతాడని భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అడగ్గా.. ‘బజరంగీ భాయిజాన్’ అని సల్మాన్ ఖాన్ పేర్కొన్నాడు. ‘రోహిత్ శర్మ ఓ అద్భుతమైన ఆటగాడు. కెప్టెన్సీ బరువును మోస్తూ ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ.. జట్టును విజయ తీరాలకు చేర్చాలనే తపన అతడిలో ఉంది’ అని చెప్పాడు. దబాంగ్ సినిమాలో సల్మాన్ పాత్ర (చుల్బుల్ పాండే) దూకుడుగా ఉంటుంది. బజరంగీ భాయిజాన్ సినిమాలో సల్మాన్ పోషించిన పాత్ర ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో రోహిత్ 217 పరుగులు చేయగా.. కోహ్లీ 156 రన్స్ బాదాడు.
Salman Khan talking about on Virat Kohli and Rohit Sharma…!!!
And he dedicates Dabangg character to Virat Kohli and Bajrangi Bhaijaan to Rohit Sharma.pic.twitter.com/5LYEBWfmW5
— CricketMAN2 (@ImTanujSingh) October 16, 2023
తాజావార్తలు
-
Erravalli Case : ఎర్రవల్లి పసుపు నీళ్ల వివాదంలో ప్రభుత్వానికి షాక్
-
ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
-
Chandrasekhar Reddy: గేట్లు బద్దలు కొట్టి, సెక్యూరిటీని బెదిరించి.. అల్లు అర్జున్ మామ దౌర్జన్యం..?
-
Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
-
Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్‌గా రైలు టికెట్లు బుకింగ్
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?