Zomato: ఇంట్లోనో.. ఆఫీసులో.. ఇంకా ఎక్కడైనా సరే కూర్చొని నచ్చిన ఫుడ్, మెచ్చిన హోటల్ నుంచి ఆర్డర్ పెట్టుకోవడానికి ఫుడ్ డెలివరీ యాప్‌లు అందుబాటులో ఉన్నాయి.. మన కోసమే కాదు.. మన అనుకునేవారికి.. వాళ్లు ఉన్న అడ్రస్‌కు కూడా పంపించే వెసులుబాటు ఉంటుంది.. అంతే కాదు.. ఆన్‌లైన్ పేమెంట్‌తో పాటు క్యాష్ ఆన్ డెలివరీ కూడా అందుబాటులో ఉండడంతో.. జేబులో క్యాష్ ఉన్నవారు కూడా ఇట్టే నచ్చిన ఫుడ్ ఆర్డర్ పెడుతున్నారు. అయితే, ఓ యువతి.. తన మాజీ ప్రియుడిని జొమాటోను అడ్డుపెట్టుకొని ఓ ఆట ఆడుకుందాం అనుకుంది.. అదే పనిగా తన మాజీ కోసం ఫుడ్ ఆర్డర్ పెడుతూ పోయింది. కానీ, జొమాటో ఇచ్చిన కౌంటర్‌తో ఒక్కసారిగా ఆమెకు మైండ్ బ్లాంక్ అయినంత పని అయ్యింది.. అది కాస్తా ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది..
Read Also: WhatsApp Ban: షాకిచ్చిన వాట్సాప్… లక్షల్లో ఇండియన్స్ అకౌంట్స్ బ్యాన్
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భోపాల్‌కు చెందిన అంకిత అనే యువతి తన మాజీ ప్రియుడి కోసం జోమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసింది. అంకిత పెట్టిన పుడ్ ఆర్డర్‌లో క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఎంచుకుంది.. అంటే ఆ ఆర్డర్ అందుకున్నవారు డబ్బులను చెల్లించాల్సి ఉంటుంది. అయితే, అంకిత ఆర్డర్ రావడంతో.. తాను పెట్టింది కాదంటూ అతనేమో ఆ ఆర్డర్‌ను తిప్పి పంపించాడు.. అంటే క్యాన్సిల్ చేశాడు.. ఇది ఒక్కసారికే పరిమితం కాలేదండోయ్.. ఏకంగా మూడు సార్లు ఇదే తంతు జరుగుతూ పోయింది.. దీంతో, జొమాటోకు చిర్రెత్తుకొచ్చినట్టుంది.. భోపాల్‌కు చెందిన అంకితా.. దయచేసి మీ మాజీకి క్యాష్ ఆన్ డెలివరీపై పుడ్ పంపడం ఆపండి.. ఇది మూడోసారి.. అతను డబ్బులు చెల్లించేందుకు నిరాకరిస్తున్నాడు అంటూ సోషల్ మీడియా వేదికగా ఓ ట్వీట్ చేసింది.. అంతేకాదు.. దయచేసి ఎవరైనా అంకితాకు ఈ విషయాన్ని చెప్పగలరు.. ఆ ఖాతాలో క్యాష్ ఆన్ డెలవరీ బ్లాక్ చేయబడిందని చెప్పగలరు.. ఈ విషయం తెలియక 15 నిమిషాలకు ఒకసారి అంకిత మళ్లీ ప్రయత్నం చేస్తూనే ఉన్నారంటూ పేర్కొంది. దీంతో, జొమాటో ట్వీట్ కాస్తా వైరల్‌గా మారిపోయింది.. ఆ ట్వీట్‌పై నెటిజన్లు స్పందిస్తూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.. రివేంజ్‌లు చాలా రకాలుగా ఉంటాయి.. జోమాటోలో క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ పెట్టి కూడా ప్రతీకారం తీర్చుకోవచ్చేమో మరి. అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు..
Ankita from Bhopal please stop sending food to your ex on cash on delivery. This is the 3rd time – he is refusing to pay!
— zomato (@zomato) August 2, 2023