YCP Rebel MLAs: నేడు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల విచారణ.. భవిష్యత్‌పై క్లారిటీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YCP Rebel MLAs: అనర్హత వేటు ఎదుర్కొంటున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యేపై స్పీకర్ తమ్మినేని సీతారం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.. ఇప్పటికే రాతపూర్వకంగా స్పీకర్‌కు వివరణ ఇచ్చిన రెబల్ ఎమ్మెల్యేలు.. ఈ రోజు స్పీకర్ ఎదుట హాజరుకావాల్సి ఉంది. మరోవైపు.. ఈ రోజే రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుండగా.. అనర్హత పిటిషన్లపై ఎమ్మెల్యేలు ఎలాంటి వివరణ ఇస్తారు.. స్పీకర్ ఎలాంటి చర్యలకు దిగనున్నారు? అనేది ఆసక్తికరంగా మారింది.
Read Also: Thursday Special: ఈ స్తోత్రాలు వింటే మీకున్న దోషాలన్నీ ఈ రోజుతో తుడుచుకుపోతాయి
Also Read
- Smit Machchhar: భారత పైలట్‌కు ఘన గౌరవం.. ఇజ్రాయెల్‌లో మారుమోగుతున్న మచ్చర్ పేరు!
- Election Commission: ఎన్నికల సంఘంలో విభేదాలపై సంచలనం.. ‘‘అన్ని నిర్ణయాలు ఏకగ్రీవమే’’..
- KTR : రేవంత్ ఒక నిజాయితీ గల మోసగాడు.. ప్రశ్నిస్తున్నామని ఆయనకు కోపం
- Flydubai Heroes: పైలట్, ప్లంబర్, డెంటిస్ట్, బిజినెస్ మ్యాన్, బ్యాంకర్.. ఫ్లైదుబాయ్ ఘటనలో హీరోలు వీరే..
అయితే, ఇవాళ స్వయంగా స్పీకర్ ముందు హాజరుకానున్నారు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు.. దీంతో, ఇవాళో.. రేపో ఫైనల్‌గా స్పీకర్ ఓ నిర్ణయం తీసుకుంటారనే ప్రచారం సాగుతోంది.. నలుగరు రెబల్ ఎమ్మెల్యేలతో పాటు.. ప్రభుత్వ విప్ నుంచి అంటే.. మొత్తం ఐదుగురి నుంచి అనర్హత పిటిషన్లపై ఒకేసారి వివరణ తీసుకోనున్నారు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. ఇప్పటికే తమపై వచ్చిన అనర్హత పిటిషన్లపై స్పీకర్‌కు లిఖిత పూర్వకంగా వివరణ ఇచ్చారు రెబల్ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి.. అయితే, తనకు నోటీసులు అందలేదని చెప్పిరా కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. ఈ విషయాన్ని స్పీకర్ కార్యాలయానికి మెమోరూపంలో తెలియజేశారు కోటంరెడ్డి.. ఇక, ముగ్గురు ఎమ్మెల్యేలు లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వగా.. తన ఫిర్యాదుపై ఆధారాలు సమర్పించారు చీఫ్ విప్ ప్రసాద్‌రాజు.. ఇవాళ వివరణ అనంతరం స్పీకర్ అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు.. తమపై ఉన్న అనర్హత పిటిషన్లు రద్దుచేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు రెబల్ ఎమ్మెల్యేలు.. తమకు ఉద్దేశ్యపూర్వకంగా అనర్హత నోటీసులు ఇచ్చారని.. తమ వాదన వినడానికి సమయం ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వీటిపై తదుపరి విచారణ ఫిబ్రవరి 26వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఏపీలో ఫిబ్రవరి 27న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి.. ఆ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ రోజు వెలువడనుంది.. ఎన్నికలకు ఒక్కరోజు ముందే కోర్టు తీర్పు వచ్చే అవకాశం ఉంది.. మరోవైపు.. కోర్టు తీర్పునకు ముందే.. రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఉత్కంఠ రేపుతోంది.
తాజావార్తలు
-
Krishna: ఇండస్ట్రీని రెండుగా చీల్చాలని చూస్తే ఊరుకోం.. జానీ మాస్టర్ భార్యపై ప్రొడక్షన్ ప్రెసిడెంట్ ఫైర్!
-
Naga Vamsi: డౌట్లు ఉంటే తీసేయండి.. నాగవంశీ మార్క్ స్టేట్మెంట్తో గురూజీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!
-
Danam Nagender: ఖైరతాబాద్ ఓట్లపై దానం ఫైర్.. హైదరాబాద్ తగలబడిపోతుంది.!
-
Smit Machchhar: భారత పైలట్‌కు ఘన గౌరవం.. ఇజ్రాయెల్‌లో మారుమోగుతున్న మచ్చర్ పేరు!
-
Election Commission: ఎన్నికల సంఘంలో విభేదాలపై సంచలనం.. ‘‘అన్ని నిర్ణయాలు ఏకగ్రీవమే’’..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?