Babar Azam: ఫామ్‌లోకి వచ్చిన పాకిస్థాన్ జట్టు.. బాబర్ ఆజమ్ వీర విహారం.. 191 పరుగులతో రికార్డు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ టెస్టు క్రికెట్లో మరో మైలురాయిని చేరుకున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను పాకిస్తాన్ 1-1తో సమం చేసుకుంది. తొలి టెస్టులో వెస్టిండీస్ 90 పరుగుల తేడాతో విజయం సాధించగా, రెండో టెస్టులో పాకిస్తాన్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వెస్టిండీస్ నిర్దేశించిన 75 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పాకిస్తాన్ 23.3 ఓవర్లలోనే ఛేదించింది. విదేశీ గడ్డపై మూడేళ్ల తర్వాత పాకిస్తాన్‌కు ఇది తొలి టెస్టు విజయం కావడం విశేషం.
ఈ సిరీస్‌లో మొత్తం 191 పరుగులు చేసిన బాబర్ ఆజమ్, ఆల్‌రౌండర్ జస్టిన్ గ్రీవ్స్‌తో కలిసి సంయుక్తంగా ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా ఎంపికయ్యాడు. 31 ఏళ్ల బాబర్ టెస్టు కెరీర్లో ఈ అవార్డును గెలుచుకోవడం ఇదే తొలిసారి. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 88 పరుగులు చేసి సెంచరీ చేజార్చుకున్న బాబర్, రెండో ఇన్నింగ్స్‌లో నాటౌట్‌గా 24 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.
Also Read
- Retired IPS Officer Wife Murder Case: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసును ఛేదించిన పోలీసులు..
- Bhuvneshwar Kumar: నాలుగేళ్ల తర్వాత రీఎంట్రీ.. భువీ ప్రదర్శనపై స్పందించిన బౌలింగ్ కోచ్ మోర్కెల్..
- Arnab Cyclone Alert: తీరం వైపు వడివడిగా 'అర్నబ్'.. బీచ్‌కు రావొద్దు.. పర్యాటకులకు మెరైన్ పోలీసుల వార్నింగ్
- Arnab Cyclone Alert: తుఫాన్ విరుచుకుపడుతుంది.. విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వండి.. సీఎం ఆదేశాలు..
ఈ సిరీస్ ముగిసేసరికి టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన పాకిస్తాన్ బ్యాటర్ల జాబితాలో బాబర్ ఆజమ్ ఒక స్థానం ఎగబాకి తొమ్మిదో స్థానానికి చేరుకున్నాడు. ఇప్పటివరకు 66 టెస్టుల్లో 43.68 సగటుతో 4,674 పరుగులు చేసిన బాబర్, 77 టెస్టుల్లో 4,660 పరుగులు చేసిన అపార అనుభవజ్ఞుడు అసద్ షఫీక్‌ను అధిగమించాడు. బాబర్ కెరీర్లో 9 సెంచరీలు, 33 అర్ధసెంచరీలు ఉన్నాయి.
ఈ జాబితాలో బాబర్ కంటే ముందున్న బ్యాటర్లందరూ టెస్టుల్లో 5,000 కంటే ఎక్కువ పరుగులు చేశారు. ఆగస్టు 19 నుంచి ఇంగ్లాండ్‌తో ప్రారంభం కానున్న మూడు టెస్టుల సిరీస్‌లో బాబర్ 5,000 పరుగుల మైలురాయిని చేరుకునే అవకాశం ఉంది.
పాకిస్తాన్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు దిగ్గజ బ్యాటర్ యూనిస్ ఖాన్ పేరిట ఉంది. అతను 118 టెస్టుల్లో 52.05 సగటుతో 10,099 పరుగులు చేశాడు (34 సెంచరీలు, 33 అర్ధసెంచరీలు). ఆ తర్వాత స్థానాల్లో జావేద్ మియాందాద్ (124 టెస్టుల్లో 8,832 పరుగులు), ఇంజమామ్ ఉల్ హక్ (119 టెస్టుల్లో 8,829 పరుగులు), మహమ్మద్ యూసుఫ్ (7,530), అజర్ అలీ (7,142), సలీమ్ మాలిక్ (5,768), మిస్బా ఉల్ హక్ (5,222), జహీర్ అబ్బాస్ (5,062) వరుసగా ఉన్నారు. ప్రస్తుతం బాబర్ ఆజమ్ 4,674 పరుగులతో 9వ స్థానంలో నిలిచాడు.
తాజావార్తలు
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
Hyderabd Metro Phase 2: హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
-
Retired IPS Officer Wife Murder Case: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసును ఛేదించిన పోలీసులు..
-
Bhuvneshwar Kumar: నాలుగేళ్ల తర్వాత రీఎంట్రీ.. భువీ ప్రదర్శనపై స్పందించిన బౌలింగ్ కోచ్ మోర్కెల్..
-
Arnab Cyclone Alert: తీరం వైపు వడివడిగా ‘అర్నబ్’.. బీచ్‌కు రావొద్దు.. పర్యాటకులకు మెరైన్ పోలీసుల వార్నింగ్
ట్రెండింగ్
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!