Trump-Hegseth: ఇరాన్ యుద్ధంపై రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్‌పై ట్రంప్ ఆగ్రహం!
- రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్‌పై ట్రంప్ ఆగ్రహం!
- ఆయుధ నిల్వలు తగ్గిపోవడంపై నిలదీత
- వాషింగ్టన్ పోస్ట్ ప్రత్యేక కథనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో దేశ ఆయుధ నిల్వల పరిస్థితిపై రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ను తీవ్రంగా నిలదీశారనే కథనం వెలుగులోకి వచ్చింది. గతవారం క్యాంప్ డేవిడ్‌లో జరిగిన సమావేశంలో అమెరికా ఆయుధ నిల్వలు తాను భావించిన దానికంటే మరింతగా తగ్గిపోయాయని తెలుసుకున్న ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ది వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది.
వార్తాపత్రిక కథనం ప్రకారం.. శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశం సందర్భంగా ట్రంప్.. ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో పెంటగాన్ సన్నద్ధతపై హెగ్సెత్ను ప్రశ్నించినట్లు సమాచారం. ఆయుధాల కొరత సమస్య ఇప్పటికే పరిష్కారమైందని తాను భావించానని ట్రంప్ వ్యాఖ్యానించినట్లు వర్గాలను ఉటంకిస్తూ కథనం వెల్లడించింది. ప్రత్యేకంగా దీర్ఘశ్రేణి కచ్చితమైన మార్గనిర్దేశిత క్షిపణులు, వైమానిక రక్షణ వ్యవస్థల్లో ఉపయోగించే ఇంటర్‌సెప్టర్ క్షిపణుల కొరత అమెరికా సైనిక వ్యూహాలపై ప్రభావం చూపుతున్నట్లు నివేదిక పేర్కొంది. ఈ కారణంగానే ఇరాన్‌పై మరిన్ని భారీ స్థాయి దాడులను ట్రంప్ ఇటీవల నిలిపివేసినట్లు సమాచారం.
Also Read
- Muhammad Yunus: "నువ్వు ఒక ఉగ్రవాదివి, వేలాది మందిని చంపావు".. ముహమ్మద్ యూనస్‌కు చేదు అనుభవం..
- Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
- Jim Jim Taara Song: "జుమ్ జుమ్ తార" అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
- Saudi: సౌదీలో రెడ్ అలర్ట్.. బంకర్లోకి వెళ్లిపోయిన యువరాజు
ఇటీవల ట్రంప్ మాట్లాడుతూ.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యంత భారీ దాడికి తాను ఆదేశాలు ఇచ్చినా, హార్ముజ్ జలసంధిపై చర్చలకు అవకాశం ఉండటంతో ఆ దాడిని చివరి క్షణంలో రద్దు చేసినట్లు వెల్లడించారు. అమెరికా ఇప్పటికే పేట్రియట్ వైమానిక రక్షణ క్షిపణులు సహా కీలక ఆయుధాల ఉత్పత్తి కోసం కొత్త ఒప్పందాలు చేసుకున్నప్పటికీ.. ఆయుధ నిల్వలను తిరిగి భర్తీ చేయడానికి చాలా సమయం పడుతుందని నివేదిక తెలిపింది. కొన్ని కీలక వ్యవస్థల తయారీకి రెండేళ్ల వరకు సమయం పట్టే అవకాశం ఉండటంతో తక్షణ పరిష్కారం కనిపించడం లేదని పేర్కొంది.
ఈ ఆయుధాల కొరత ప్రభావం ఉక్రెయిన్‌పైనా పడుతున్నట్లు కథనం వెల్లడించింది. రష్యా దీర్ఘశ్రేణి దాడులు కొనసాగుతున్న వేళ.. పాశ్చాత్య దేశాల నుంచి అవసరమైన వైమానిక రక్షణ వ్యవస్థలను సమకూర్చుకోవడంలో ఉక్రెయిన్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పేర్కొంది. క్యాంప్ డేవిడ్ సమావేశంలో హెగ్సెత్ తన నిర్ణయాలను సమర్థించుకున్నారని, ఆయుధ నిల్వల అసలు పరిస్థితిని ట్రంప్‌కు పూర్తిగా తెలియజేయడంలో ఉప రక్షణ మంత్రి స్టీఫెన్ ఫైన్‌బర్గ్ విఫలమయ్యారని ఆయన వ్యాఖ్యానించినట్లు వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది.
ఇరాన్‌పై సైనిక చర్య త్వరగా విజయవంతమవుతుందని హెగ్సెత్ గతంలో బలంగా వాదించినప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ట్రంప్ ఆయనపై అసంతృప్తితో ఉన్నట్లు పలువురు అధికారులు పేర్కొన్నారని కథనం వెల్లడించింది. అయితే ఈ కథనాన్ని వైట్ హౌస్ పూర్తిగా ఖండించింది. ఈ సంఘటన ఎప్పుడూ జరగలేదని, అధ్యక్షుడు ట్రంప్‌కు రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్‌పై పూర్తి విశ్వాసం ఉందని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలైన్ లెవిట్ స్పష్టం చేశారు.
పెంటగాన్ కూడా ఇదే విధంగా స్పందించింది. ఆయుధ నిల్వలపై హెగ్సెత్ ఎవరినీ తప్పుదోవ పట్టించలేదని, ఉప రక్షణ మంత్రిపై ఆయన నిందలు మోపలేదని పెంటగాన్ ప్రధాన ప్రతినిధి షాన్ పార్నెల్ తెలిపారు. ఆయుధాల కొరత, అంతర్గత విభేదాలు, ఇరాన్‌పై రక్షణ మంత్రి వైఖరికి సంబంధించిన ఆరోపణలన్నీ పూర్తిగా అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు.
ఇక జూలైలో జరిగిన సెనేట్ విచారణలో హెగ్సెత్.. ఇరాన్ అంశంపై తాను ట్రంప్‌కు ఇచ్చిన సైనిక సలహాల వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. ప్రస్తుతం నెలకొన్న ఆయుధాల కొరతకు ట్రంప్ ప్రభుత్వ విధానాలు కారణం కాదని.. గత బైడెన్ ప్రభుత్వ నిర్ణయాలే ఇందుకు ప్రధాన కారణమని ఆయన ఆరోపించారు.
తాజావార్తలు
-
BJP: ‘‘ఎన్నికల కమిషనర్లకు కేంద్ర మంత్రి, గవర్నర్ పదవులు’’.. కాంగ్రెస్ గత చరిత్రపై బీజేపీ ఫైర్..
-
Gutkha, Pan Masala Ban: గుట్కా, పాన్ మసాలాపై ఏడాది పాటు నిషేధం.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
-
Osmania Hospital Protest: ఉస్మానియాలో జూడాల ఆందోళన.. ప్రభుత్వానికి 10 రోజుల డెడ్‌లైన్.!
-
DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
-
Pawan Kalyan-TDP Leaders Meets: టీడీపీ–జనసేన సీట్ల సర్దుబాటుపై కసరత్తు.. పవన్ కల్యాణ్‌తో పల్లా, నిమ్మల భేటీ
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!