మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఎటువంటి సమస్య లేదని, బాలినేని జిల్లాకు వైసీపీలో అత్యంత విలువైన నాయకుడని వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్, ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. పార్టీలో ఆయనకున్న ప్రాధాన్యత తగ్గదని.. ఆయన స్థానం ఆయనకు ఉంటుందన్నారు. మూడు లిస్టులు ఇప్పటికే రిలీజ్ చేశాం.. త్వరలో మరో లిస్ట్ ఉంటుందని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు.
ఏపీలో ఇప్పుడంతా కేబినెట్ మార్పుల గురించే చర్చించుకుంటున్నారు. మంత్రివర్గ విస్తరణపై ఎన్టీవీతో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. మంత్రివర్గ విస్తరణ సీఎం జగన్ ఆలోచన ప్రకారం జరుగుతుంది. సీఎం జగన్ నిర్ణయాన్ని ప్రతీ ఒక్కరూ గౌరవించాల్సిందే అన్నారు. మంత్రివర్గ మార్పులు.. చేర్పులపై ఎవరికీ క్లారిటీ లేదు. సీఎం జగన్ ఏ రోజు చెబితే ఆ రోజు రాజీనామాలు చేసేందుకు మంత్రులందరూ సిద్ధంగా వున్నామన్నారు. సీఎం జగన్ నూతన మంత్రివర్గంలో మంత్రులుగా ఎవరుండాలని నిర్ణయిస్తే వారే ఉంటారు. జనసేన…