Perni Nani: తిరుమల లడ్డూ ప్రసాదాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు..
- తిరుమల పవిత్రతను రాజకీయాలకు వాడుకుంటున్నారు
- ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు
- మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Perni Nani: తిరుమల లడ్డూ వివాదంపై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు తిరుమల పవిత్రతను దుర్మార్గంగా రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆయన విమర్శించారు. సీఎం పదవిలో ఉండి తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారన్నారు. ల్యాబ్‌లో గుర్తించిన ఆవు నెయ్యి ట్యాంకర్లను వెన్నక్కి తిప్పి పంపామని ఈఓ శ్యామల రావు చెప్పారని ఆయన వెల్లడించారు. చంద్రబాబు, లోకేష్ పచ్చి అబద్ధాలు ఆడారన్నారు. చంద్రబాబు, లోకేష్ ప్రసాదంపై చేస్తున్న అసత్య ప్రచారానికి పవన్ కూడా జత కలిశారన్నారు. దున్నపోతు ఈనిందంటే అన్న సామెత మాదిరి పవన్ తీరు ఉందన్నారు.కూటమి చేసిన ఈ అపవిత్ర ప్రచారం నేపథ్యంలో వచ్చే శనివారం ఆలయాల్లో పూజలు చేయటం ద్వారా పరిహారం చేయాలని నిర్ణయించామన్నారు. కూటమి నేతల పాపాల పరిహారం కోసం ఆలయాల్లో పూజలకు వైసీపీ పిలుపునిస్తోందన్నారు.
Read Also: Tirumala Laddu: ఏఆర్ డెయిరీకి టీటీడీ షాక్.. నెయ్యి వ్యవహారంలో పోలీసులకు ఫిర్యాదు
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
ప్రాయశ్చిత్త దీక్ష తప్పు చేసిన వారు చేస్తారని.. తెలిసి తెలియక తప్పులు చేసిన వారు ఈ దీక్ష చేస్తారని పేర్ని నాని పేర్కొన్నారు. చంద్రబాబు, పవన్ శరీరాలు వేరు తప్ప ఆత్మ ఒక్కటేనన్నారు. చంద్రబాబు కుళ్లిన మెదడుతో తిరుమల ప్రసాదంపై మలినపు మాటలు మాట్లాడారని విమర్శించారు. ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని, జగన్‌ను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు తిరుమల ప్రసాదంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఆ పాపం దహించుకుపోవటంతో పవన్ ఈ దీక్ష చేస్తున్నారన్నారు. పవన్ హిందువు అని చెబుతున్నారా ?.. భీమవరంలో బాప్టిజం తీసుకున్నాను అని పవన్ చెప్పారు కదా అంటూ వ్యాఖ్యానించారు. జనం ఏ విషయం మర్చిపోరు అనే విషయం పవన్ తెలుసుకోవాలన్నారు. పవన్ కొత్తగా హిందూ మతం తీసుకున్నారు అనుకుంటా అంటూ ఆయన అన్నారు.హెరిటేజ్‌లో కిలో ఆవు నెయ్యి 400కి అమ్ముతున్నారన్నారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!