తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు కాల్ మనీ.. ఇప్పుడు లోన్ యాప్స్ (Loan Apps) కలవరం కలిగిస్తున్నాయి. లోన్ యాప్స్ రికవరీ ఏజెంట్ల వేధింపులతో అనేకమంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఎన్టీవీతో విజయవాడ సీపీ క్రాంతిరాణా టాటా (Kranthi Rana Tata) మాట్లాడారు. లోన్ యాప్స్ చాలా ప్రమాదకరం…ప్రజలు ఎవ్వరూ లోన్ యాప్స్ లో మనీ తీసుకోవదన్నారు.
లోన్ అప్లయ్ చేసే క్రమంలోనే పూర్తి వ్యక్తిగత సమాచారం ఇచ్చేస్తున్నారు. మన ఫోన్ కాంటాక్స్ట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. దీంతో వారు మన బంధువులకు కాల్ చేసి వేధిస్తున్నారు. సోషల్ మీడియాలో మన అకౌంట్ యాక్సెస్ ఎవరికీ ఇవ్వవద్దు. అందులో మహిళలు, చిన్నపిల్లల ఫోటోలు మార్ఫ్ చేసి అశ్లీలంగా తయారు చేసి పంపుతున్నారు. కాల్ సెంటర్స్ ద్వారా ఆపరేట్ చేస్తున్నారు.ఈ లోన్ యాప్ లకు ఆర్బీఐ, ప్రభుత్వం అనుమతులు లేవు. ఇలాంటి వాటికి పబ్లిక్ దూరంగా ఉండాలన్నారు. రికవరీ ఏజెంట్స్ పై కూడా దృష్టి పెట్టాం అనీ, నందిగామ కేసులో రికవరీ కంపెనీలను, ఏజెంట్లను అరెస్టు చేసాం అని వివరించారు సీపీ క్రాంతిరాణా టాటా.
ఇటీవల లోన్ యాప్స్ ఆగడాల వల్ల విద్యార్ధినులు, చిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. స్వయానా మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి (Kakani govardhan reddy), మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ (Anilkumar Yadav) లను కాల్ సెంటర్ ఏజెంట్లు వేధించిన ఉదంతం అందరికీ తెలిసిందే. ఆ రికవరీ ఏజెంట్ల భరతం పట్టారు పోలీసులు. ఇంటికి వచ్చి మరీ వేధించడం ఎక్కువైంది. తమ ఫోన్ కాంటాక్ట్స్ లోని వ్యక్తులకు, మహిళలకు ఫోన్లు చేసి మరీ వేధిస్తున్నారు.
సోషల్ మీడియా ద్వారా అసభ్యకరమయిన, అభ్యంతకరమయిన మెసేజ్ లు పెట్టడం, బ్లాక్ మెయిల్ చేయడం మరీ ఎక్కువైంది. దీంతో వేధింపులు తాళలేక ఎవరికీ చెప్పుకోలేక ఆత్మహత్యలే శరణ్యం అని భావిస్తున్నారు. లోన్ యాప్స్ ద్వారా 10 వేలు రుణం తీసుకుంటే.. దానికి రెండుమూడురెట్లు రికవరీ చేస్తున్నారు. వడ్డీ ఎంత అనేది సరిగా తెలియచేయకుండా.. దరఖాస్తుల్లో సంతకాలు తీసుకుని వేధిస్తున్నారు. బాధితులు లోన్ యాప్స్ వేధింపులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ తీసుకుని పోలీసులకు ఫిర్యాదుచేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని పోలీసులు సూచిస్తున్నారు.
Monkeypox: కేరళలో మరో మంకీపాక్స్ కేసు.. దేశంలో 7కు చేరిన సంఖ్య