YS Jagan: ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే అరెస్టులు: వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ సాగిస్తున్న రాజకీయ కక్షసాధింపు చర్యలు, పోలీసుల అరాచకాలు ప్రజాస్వామ్యాన్నే హాస్యాస్పదం చేస్తున్నాయని.. అధికార పార్టీ నేతలు దాడులకు పాల్పడితే వారికి రక్షణ కల్పిస్తూ, దాడికి గురైన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపైనే అక్రమ కేసులు బనాయించడం ఏ రకమైన న్యాయం? ప్రజాప్రతినిధులు బాధితులకు అండగా నిలబడితే వారిపై కూడా కేసులు పెడుతూ, ప్రశ్నించిన వారి తలుపులు అర్ధరాత్రి బద్దలుకొట్టి అరెస్టులు చేయడం పోలీసు రాజ్యానికి పరాకాష్ట అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఆలూరు బీసీ ఎమ్మెల్యే విరూపాక్షి ఇంటిపై అర్ధరాత్రి 2.45 గంటలకు భారీ పోలీసు బలగాలతో దాడి చేసి, తలుపులు పగలగొట్టి ఆయనను, ఆయన కుమారుడిని అరెస్టు చేసిన తీరు రాష్ట్రంలో చట్టబద్ధ పాలన లేదని స్పష్టం చేస్తోందని జగన్ పేర్కొన్నారు. బాధితుడిని పరామర్శించడానికి వెళ్లిన ఎమ్మెల్యేపై టీడీపీ శ్రేణులు రాళ్లతో దాడి చేస్తే, ఆ దాడి చేసిన వారిని వదిలేసి ఎమ్మెల్యే విరూపాక్షిపైనే హత్యాయత్నం కేసులు పెట్టడం ఘోరమని అన్నారు. ఈ అరాచకానికి సంబంధించిన దృశ్యాలు బయటకు రాకుండా ఇంట్లోని సీసీటీవీ హార్డ్‌డిస్కులను పోలీసులు తీసుకెళ్లడం సాక్ష్యాలను మాయం చేసే ప్రయత్నం కాదా? అని ప్రశ్నించారు.
Also Read
- Attack On Pappu Yadav: ఎంపీ పప్పు యాదవ్‌పై కత్తితో దాడి.. హడలెత్తించిన దుండగులు..
- Food Delivery: జొమాటో, స్విగ్గీలకు ఊహించని షాక్.. ఫుడ్ డెలివరీ రేసులోకి అడుగుపెట్టిన 'షాపింగ్' కింగ్..
- Yuvraj Singh: యువరాజ్ 'యువి' పేరు వాడుతున్నారా..? ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు..
- Jasprit Bumrah: బుమ్రాకు ఏమైంది..? ఎందుకు సిరీస్ నుంచి దూరమయ్యాడు..? కారణం ఇదే..
ఇది ఒక్క ఆలూరుకే పరిమితం కాలేదని ఆయన గుర్తుచేశారు. శ్రీకాకుళంలో ఒక రోడ్డు ప్రమాదాన్ని హత్య కేసుగా మార్చి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అరెస్టు చేశారని, గుంటూరు ఈస్ట్ మాజీ ఎమ్మెల్యే షేక్ మొహ్మద్ ముస్తఫా వ్యాపార వివాదంలో ఉన్న వ్యక్తిని పోలీసులకు అప్పగిస్తే, ఆయనపైనే కిడ్నాప్ కేసు నమోదు చేశారని ఆరోపించారు. నాయకులు ప్రజల మధ్యకు వెళ్లినా, ప్రభుత్వాన్ని ప్రశ్నించినా కేసులు పెట్టడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని అన్నారు.
నేటి ‘Gen-Z’ తరం డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ, మంత్రి లోకేష్ రాజీనామా, విద్యాదీవెన బకాయిల విడుదల, నిరుద్యోగ భృతి గురించి నిలదీస్తుంటే… సమాధానం చెప్పలేక ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ అరెస్టుల డ్రామాలు ఆడుతోందని జగన్ విమర్శించారు. “చంద్రబాబు గారూ… అధికారం, పోలీసు బలం ఎప్పటికీ శాశ్వతం కావు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని అక్రమ కేసులకైనా, అరెస్టులకైనా భయపడేది లేదు. ప్రజా సమస్యలపై, ప్రభుత్వ అన్యాయాలపై మా పోరాటం తుదివరకు కొనసాగుతుంది” అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Sooraj Pancholi: కోర్టు క్లీన్ చిట్ ఇచ్చినా.. జియా ఖాన్ కేసులో సూరజ్ బాధకు ముగింపు లేదా?
-
YS Jagan: ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే అరెస్టులు: వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
-
Raj Thackeray: మోదీని పొగిడి విదేశాల్లో ఎందుకు ఉంటున్నారు? మాధవన్, వివేక్ ఒబెరాయ్‌పై రాజ్ థాకరే సంచలన వ్యాఖ్యలు
-
Attack On Pappu Yadav: ఎంపీ పప్పు యాదవ్‌పై కత్తితో దాడి.. హడలెత్తించిన దుండగులు..
-
Samantha Pregnancy: ప్రతి దశ ఒకేలా ఉండదు.. బేబీ బంప్‌తో సమంత ఫోటోలు వైరల్!
ట్రెండింగ్
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Door Mat Cleaning : డోర్‌మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్‌తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!
-
120dB స్పీకర్, IP64 రేటింగ్‌తో JioTag 2 లాంచ్.. ధర ఎంతంటే..?