IBPS RRB 2026: నిరుద్యోగులకు అలర్ట్.. 13,441 బ్యాంక్ ఉద్యోగాలు.. IBPS RRB దరఖాస్తులకు రేపే చివరి తేదీ
- బ్యాంక్ ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్
- 13,441 పోస్టులు
- అప్లై చేసేందుకు ఇదే చివరి ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IBPS RRB 2026 Last Date: బ్యాంకింగ్ రంగంలో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇది ముఖ్యమైన అవకాశం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) దేశవ్యాప్తంగా ఉన్న రీజినల్ రూరల్ బ్యాంకుల్లో (RRBs) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 13,441 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబర్ 21, 2026 చివరి తేదీగా నిర్ణయించారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఎలాంటి ఆలస్యం చేయకుండా ibps.in అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
13,441 పోస్టులు.. ఏ పోస్టుకు ఎన్ని ఖాళీలు?
IBPS RRB 15వ రిక్రూట్మెంట్లో ఆఫీస్ అసిస్టెంట్‌తో పాటు వివిధ ఆఫీసర్ స్థాయి పోస్టులను భర్తీ చేయనున్నారు.
Also Read
- Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
- TGPSC: నిరుద్యోగులకు శుభవార్త.. టీజీపీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల..
- Layoffs: 45ఏళ్లు దాటితే ఉద్యోగం ఊస్ట్? అంకుల్స్‌ను భయపెడుతున్న లెక్కలు!
- TSLPRB: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్షల తేదీలు ఖరారు.. కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలు ఎప్పుడంటే..
ఆఫీస్ అసిస్టెంట్ -7,993
ఆఫీసర్ స్కేల్-I -4,256
ఆఫీసర్ స్కేల్-II (జనరల్ బ్యాంకింగ్) -666
ఆఫీసర్ స్కేల్-II (IT) -79
ఆఫీసర్ స్కేల్-II (CA) -99
ఆఫీసర్ స్కేల్-II (లా) -48
ఆఫీసర్ స్కేల్-II (ట్రెజరీ మేనేజర్) -18
ఆఫీసర్ స్కేల్-II (మార్కెటింగ్ ఆఫీసర్) -16
ఆఫీసర్ స్కేల్-II (అగ్రికల్చర్ ఆఫీసర్) -48
ఆఫీసర్ స్కేల్-III -220
మొత్తం -13,441
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
పోస్టును బట్టి విద్యార్హతలు మారుతాయి. సంబంధిత పోస్టులకు అభ్యర్థులు ఎలక్ట్రానిక్స్/కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, CA, MBA, LLB, వ్యవసాయం, హార్టికల్చర్, డెయిరీ, యానిమల్ హస్బెండ్రీ, వెటర్నరీ సైన్స్, ఇంజినీరింగ్ వంటి విభాగాల్లో నిర్ణీత విద్యార్హత కలిగి ఉండాలి. ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఆఫీసర్ స్కేల్-I పోస్టులకు 18 నుంచి 30 సంవత్సరాలు, ఆఫీసర్ స్కేల్-II పోస్టులకు 21 నుంచి 32 సంవత్సరాలు, ఆఫీసర్ స్కేల్-III పోస్టులకు 21 నుంచి 40 సంవత్సరాల వయసు ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు ఎంత?
IBPS RRB రిక్రూట్మెంట్కు దరఖాస్తు చేసే అభ్యర్థులు కేటగిరీ ఆధారంగా ఫీజు చెల్లించాలి.
జనరల్/ఓబీసీ/EWS: రూ.850
SC/ST/PwBD: రూ.175
దరఖాస్తు విధానం
ముందుగా ibps.in అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి.
హోమ్‌పేజీలో RRB రిక్రూట్మెంట్కు సంబంధించిన అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి.
Click here for New Registration ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
అడిగిన వ్యక్తిగత వివరాలను నమోదు చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.
రిజిస్ట్రేషన్ తర్వాత లాగిన్ చేసి మిగిలిన వివరాలను నమోదు చేయాలి.
ఫోటో, సంతకం తదితర అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి.
కేటగిరీ ప్రకారం దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
అప్లికేషన్‌ను పూర్తిగా పరిశీలించి సబ్మిట్ చేయాలి.
భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ తీసుకుని భద్రపరుచుకోవాలి.
అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకునేందుకు చివరి తేదీ అక్టోబర్ 6, 2026.
ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది?
IBPS RRB రిక్రూట్మెంట్లో పోస్టును బట్టి ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఇందులో ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ పరీక్ష, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ వంటి దశలు ఉండవచ్చు. అభ్యర్థులు తమ పోస్టుకు సంబంధించిన పూర్తి ఎంపిక విధానం, సిలబస్, పరీక్ష విధానం, విద్యార్హతలు, వయోపరిమితి తదితర వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను తప్పనిసరిగా పరిశీలించాలి.
తాజావార్తలు
-
IBPS RRB 2026: నిరుద్యోగులకు అలర్ట్.. 13,441 బ్యాంక్ ఉద్యోగాలు.. IBPS RRB దరఖాస్తులకు రేపే చివరి తేదీ
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
The Vvaan: 400 ఏళ్ల ఆలయంలో సిద్ధార్థ్, తమన్నా ప్రత్యేక పూజలు.. గుడి మిస్టరీతోనే వస్తున్న కొత్త సినిమా
-
Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
-
Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్‌ఫ్లిక్స్‌లో నెం.1గా ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!