Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
- మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా స్మృతి మంధాన..
- ఆసియా క్రీడలు 2026 సెమీఫైనల్లో న్యూజిలాండ్ మాజీ స్టార్ సుజీ బేట్స్ రికార్డు బ్రేక్..
- టీ20 అంతర్జాతీయ క్రికెట్లో 100 సిక్సర్లు పూర్తి చేసిన తొలి భారత బ్యాటర్‌గా మంధాన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Smriti Mandhana: భారత మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన అరుదైన రికార్డు సృష్టించింది. మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచింది. ఆసియా క్రీడలు 2026లో భాగంగా నేడు బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీఫైనల్లో ఈ ఘనత సాధించింది. న్యూజిలాండ్ స్టార్ సుజీ బేట్స్ రికార్డును మంధాన అధిగమించింది.
బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు ముందు మంధానకు రికార్డు బద్దలు కొట్టేందుకు కేవలం 7 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో మారుఫా అక్తర్ బౌలింగ్‌లో వరుసగా రెండు బౌండరీలు బాదిన మంధాన ఈ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. దీంతో మహిళల టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది.
Also Read
- Shreyas Iyer: "ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం".. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
- CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
ఇటీవలే మహిళల క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కూడా మంధాన రికార్డు సాధించింది. మహిళల ఆసియా కప్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేయడంతో మహిళల క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా కూడా తన పేరును రికార్డు పుస్తకాల్లో నిలిచింది. బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీఫైనల్లో మంధాన మరో మైలురాయిని అందుకుంది. మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో 100 సిక్సర్లు పూర్తి చేసిన తొలి భారత బ్యాటర్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో ఆమె 19 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 37 పరుగులు చేసింది.
మహిళల వన్డే క్రికెట్లో అత్యధిక పరుగుల రికార్డు భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ పేరిట ఉంది. టెస్టుల్లో ఇంగ్లండ్‌కు చెందిన జాన్ బ్రిటిన్ అగ్రస్థానంలో ఉన్నారు. ఇప్పుడు టీ20ల్లో సుజీ బేట్స్ ను అధిగమించి స్మృతి మంధాన మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది.
ఆసియా క్రీడలు 2026 మహిళల క్రికెట్ సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. క్వార్టర్ ఫైనల్లో జపాన్ను ఓడించిన భారత్.. వరుస విజయాలతో ఫైనల్‌పై కన్నేసింది. గత ఆసియా క్రీడల్లో మహిళల క్రికెట్లో భారత్ స్వర్ణ పతకం సాధించింది. ఈసారి కూడా టైటిల్‌ను నిలబెట్టుకోవాలని భారత జట్టు లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు తొలి సెమీఫైనల్లో పాకిస్థాన్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించిన శ్రీలంక ఫైనల్‌కు చేరుకుంది.
ఈ మధ్యనే హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు మహిళల టీ20 ఆసియా కప్ టైటిల్‌ను కూడా గెలుచుకుంది. శ్రీలంకను ఫైనల్లో 72 పరుగుల తేడాతో ఓడించి ట్రోఫీని అందుకుంది. అయితే ట్రోఫీ అందజేత కార్యక్రమంలో ఏసీసీ అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ నుంచి ట్రోఫీ స్వీకరించేందుకు భారత జట్టు నిరాకరించడంతో అనంతరం వివాదం నెలకొంది.
తాజావార్తలు
-
MS Dhoni: ఐపీఎల్ బెట్టింగ్ కేసు.. ఎంఎస్ ధోనీకి హైకోర్టు నోటీసులు!
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు