వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల సమావేశంలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. అంతేకాదు, సమావేశం సందర్భంగా నాయకులకు సీఎం జగన్ మెత్తటి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. బాధ్యత తీసుకుంటే కచ్చితంగా పని చేయాలి. పని చేయలేక పోతే ముందే చెప్పేయండి. మీరు పని చేస్తున్నారో లేదో పర్యవేక్షించటానికి నా మనుషులు ఉంటారు. మీరు పని చేయకపోతే మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది.పని చేసిన వాళ్ళకు తగిన గుర్తింపు ఉంటుంది. అబ్జర్వర్లకు వారి విధుల పై సీఎం జగన్ స్పష్టత ఇచ్చినట్టు తెలుస్తోంది. పరిశీలకులతో సీఎం జగన్ పలు అంశాలను ప్రస్తావించారు. అబ్జర్వర్లు మీకు కేటాయించిన నియోజకవర్గాలను గెలిపించుకుని తీసుకుని రండి. మరో పవర్ సెంటర్ గా మారే ప్రయత్నం చేయకండి. ఐదో తరగతి పిల్లవాడిని 10వ తరగతి క్లాస్ లో కూర్చో బెట్టినట్లే కొద్ది రోజులు మీకు ఇబ్బంది ఉంటుంది. నెమ్మదిగా అలవాటు పడతారు. మీరు గెలిపించుకుని వస్తే మిమ్మల్ని ఎలా చూసుకోవాలి అన్న బాధ్యత నాది అన్నారు జగన్.
Read Also: Perni Nani: పవన్ వారాహి వాహనంపై సెటైర్లు.. పసుపు రంగేయండి
మరో ఏడాదిన్నరలో ఎన్నికల యుద్ధం మొదలు కాబోతోంది. ఈనేపథ్యంలో నియోజవకర్గాల్లో చురుగ్గా పార్టీ కార్యక్రమాలపై సీఎం దిశా నిర్దేశం చేశారు. క్షేత్ర స్థాయిలో బలోపేతం కానుంది వైయస్సార్‌సీపీ సైన్యం. ప్రతి యాభై ఇళ్లకు ఇద్దరు చొప్పున గృహసారథులు వుంటారు. రాష్ట్రవ్యాప్తంగా 5.20 లక్షల మంది నియామకం కోసం కసరత్తు చేస్తోంది పార్టీ అధిష్టానం. ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల్లో ముగ్గురు పార్టీ కన్వీనర్లు వుంటారు. ఇందులో తప్పనిసరిగా మహిళ వుంటుంది. మొత్తంగా 45 వేల మంది కన్వీనర్ల నియామకం జరగనుంది.
డిసెంబరు 20 కల్లా గ్రామ, వార్డు సచివాలయాల్లో పార్టీ కన్వీనర్ల నియామకం పూర్తవుతుంది. తర్వాత 10-15 రోజులపాటు ఇంటింటికీ పార్టీ సచివాలయ కన్వీనర్లు వుంటారు. ఆతర్వాత గృహసారథుల నియామకం జరుగుతుంది. రీజినల్ కో ఆర్డినేటర్లు, జిల్లాల పార్టీ అధ్యక్షుడు, నియోజకవర్గాల పరిశీలకులకు కార్యక్రమాన్ని నిర్దేశించారు సీఎం జగన్. రీజనల్ కోఆర్డినేటర్ల, జిల్లా అధ్యక్షులు, పరిశీలకులతో సీఎం సమావేశం నిర్వహించారని తెలిపారు మాజీ మంత్రి కురసాల కన్నబాబు. బూత్ కమిటీలకు కొత్త రూపం ఇస్తామన్నారు. గతంలో గ్రామాన్ని యూనిట్ గా తీసుకునే వారు. కానీ ఇప్పుడు సచివాలయాన్ని యూనిట్ గా తీసుకుని వ్యవస్థ ఏర్పాటు చేశారు. మరింత సూక్ష్మ స్థాయికి వెళ్ళినట్లు అవుతుందన్నారు.

మాజీ మంత్రి కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడు పేర్ని నాని మాట్లాడుతూ.. గ్రామ స్థాయిలో ప్రతి ఇంటికి పార్టీ వెళ్ళే విధంగా ముఖ్యమంత్రి జగన్ దిశానిర్దేశం చేశారు. పార్టీని కళ్ళు, చెవులుగా పరిశీలకులు వ్యవహరిస్తారు. ఉండవల్లి అరుణ్ కుమార్ మేధావి. రాష్ట్రాలు విడిపోయి ఎవరి సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ రెండు రాష్ట్రాలు కలవటం సాధ్యమవుతుందా… అరుణ్ కుమార్ వ్యాఖ్యలు. ఆచరణ సాధ్యం అవుతాయా? టీఆర్ఎస్ నాయకులు ఆకలి మీద ఉన్నారన్నారు. త్వరలో ఎమ్మెల్యేలతోనూ సీఎం జగన్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. 10 రోజుల్లో బూత్ కమిటీల ఏర్పాటు పూర్తవుతుందన్నారు.