YS Jagan: కుయ్ కుయ్ మూగబోతోంది.. ప్రజల ప్రాణాలు పోతున్నాయి!
- శిశువు మృతి చెందటంపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఆందోళన
- కుయ్.. కుయ్.. మూగబోతోంది
- ఫోన్ చేసినా ఎందుకు 108 రావడం లేదు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
108 అంబులెన్స్ రాక శిశువు మృతి చెందటంపై వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘కుయ్ కుయ్ మూగబోతోంది.. ప్రజల ప్రాణాలు పోతున్నాయి’ అని కూటమి ప్రభుత్వంపై జగన్ మండిపడ్డారు. ప్రజల ప్రాణాలకు భరోసా ఇచ్చే 108 సర్వీసులకు ప్రభుత్వం ఉరివేస్తోందని ఫైర్ అయ్యారు. పాడేరు సమీపంలోని ముల్లుమెట్టకు చెందిన నిండు గర్భిణీని ఆస్పత్రికి తరలించేందుకు 108 వాహనం రాకపోవడంతో.. ఆమె ఆటోలోనే ప్రసవించింది. వైద్యం అందక శిశువు ఆటోలోనే కన్నుమూసింది. ఈ ఘటనపై జగన్ స్పందిస్తూ.. వీడియోతో సహా ఎక్స్‌లో పోస్టు చేశారు.
Also Read: CM Chandrababu: ఐటీ గురించి కాదు.. రైతుల కోసమే ఎక్కువగా ఆలోచిస్తా!
Also Read
- AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
- Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
- AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
- Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
‘కుయ్.. కుయ్.. మూగబోతోంది, ప్రజల ప్రాణాలు పోతున్నాయి. ప్రజల ప్రాణాలకు భరోసా ఇచ్చే 108 సర్వీసులకు @ncbn ప్రభుత్వం ఉరివేస్తోంది. పాడేరు సమీపంలోని ముల్లుమెట్టకు చెందిన నిండు గర్భిణీని ఆస్పత్రికి తరలించేందుకు 108 రాకపోవడంతో ఆటోను ఆశ్రయించాల్సి వచ్చింది. చివరకు ఆటోలోనే ప్రసవం జరిగింది. వైద్యం అందక ఆటోలోనే శిశువు మరణించింది. వైసీపీ హయాంలో అంబులెన్స్‌లు, పట్టణ ప్రాంతాల్లో ఫోన్ చేసిన 15 నిమిషాల్లోగా 108 రావాలన్న నిబంధన ఉంటే.. దాన్ని అధిగమిస్తూ 12-14 నిమిషాల్లోనే చేరుకునేవి. గ్రామీణ ప్రాంతాల్లో 20 నిమిషాల్లో చేరుకోవాలని నిబంధన ఉంటే 16-17 నిమిషాల్లోనూ, గిరిజన ప్రాంతాల్లో 30 నిమిషాల్లో చేరుకోవాలని నిబంధన ఉంటే దీన్నికూడా అధిగమిస్తూ 22.12 నిమిషాల్లోనే చేరుకుని 108లు సేవలందించాయి. మరి ఎందుకు ఇప్పుడు చేరుకోవడం లేదు?. ఫోన్ చేసినా ఎందుకు రావడం లేదు?. ప్రభుత్వం అన్నది పనిచేస్తేనే కదా?. కలెక్షన్ల మీద తప్ప ప్రజలమీద ధ్యాస ఉంటే కదా?’ అని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కుయ్.. కుయ్.. మూగబోతోంది, ప్రజల ప్రాణాలు పోతున్నాయి
ప్రజల ప్రాణాలకు భరోసా ఇచ్చే 108 సర్వీసులకు @ncbn ప్రభుత్వం ఉరివేస్తోంది. పాడేరు సమీపంలోని ముల్లుమెట్టకు చెందిన నిండు గర్భిణీని ఆస్పత్రికి తరలించేందుకు 108 రాకపోవడంతో ఆటోను ఆశ్రయించాల్సి వచ్చింది. చివరకు ఆటోలోనే ప్రసవం… pic.twitter.com/klxCNlRJnS— YS Jagan Mohan Reddy (@ysjagan) September 22, 2025
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!