వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ దంపతులు ఏపీ గవర్నర్ అబ్ధుల్ నజీర్‌తో సమావేశం అయ్యారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు రాజ్ భవన్లో గవర్నర్‌తో దాదాపు గంట పాటు భేటీ అయ్యారు. గవర్నర్‌తో భేటీ అనంతరం జగన్ దంపతులు తిరిగి తాడేపల్లికి బయలుదేరి వెళ్లారు. మర్యాదపూర్వకంగానే గవర్నర్‌ను జగన్ దంపతులు కలిశారని వైసీపీ వర్గాలు అంటున్నాయి. ఇటీవలే అనారోగ్య సమస్యల నుంచి కోలుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆరోగ్య పరిస్థితిపై జగన్ దంపతులు వాకబు చేశారట.
Also Read: Kollu Ravindra: ఉచిత బస్సు ప్రయాణం ఆగష్టు15 నుంచే.. ఆటో డ్రైవర్‌కు 10 వేలు!
గవర్నర్ అబ్ధుల్ నజీర్‌తో భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని వైసీపీ వర్గాలు అంటున్నాయి. నిన్న హైదరాబాద్‌లోని భారతి సిమెంట్స్ కార్యాలయంలో సిట్ అధికారుల సోదాల నేపథ్యంలో నేడు గవర్నర్‌తో వైఎస్ జగన్ దంపతుల భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుందన్న అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. గవర్నర్‌తో భేటీలో తాజా రాజకీయ పరిణామాలపై కూడా చర్చ జరిగి ఉండవచ్చని సమాచారం. గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో జగన్ దంపతుల భేటీపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.