వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ దంపతులు ఏపీ గవర్నర్ అబ్ధుల్ నజీర్‌తో సమావేశం అయ్యారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు రాజ్ భవన్‌లో గవర్నర్‌తో దాదాపు గంట పాటు భేటీ అయ్యారు. గవర్నర్‌తో భేటీ అనంతరం జగన్ దంపతులు తిరిగి తాడేపల్లికి బయలుదేరి వెళ్లారు. మర్యాదపూర్వకంగానే గవర్నర్‌ను జగన్ దంపతులు కలిశారని వైసీపీ వర్గాలు అంటున్నాయి. ఇటీవలే అనారోగ్య సమస్యల నుంచి కోలుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆరోగ్య పరిస్థితిపై జగన్ దంపతులు వాకబు…