Bosta Satyanarayana: అకాల వర్షాలతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో పంట నష్టం జరిగింది.. ఆ నష్టాన్ని అంచనా వేసే పనిలో పడిపోయింది ప్రభుత్వం.. మరోవైపు.. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందంటూ విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను పరామర్శిస్తూ.. వారిని ఆదుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు విపక్ష నేతలు.. అయితే, ప్రభుత్వం ప్రతీ రైతుకు న్యాయం చేస్తుందని స్పష్టం చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీ అధినేత చంద్రబాబుపై…
ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స కుమారుడి వివాహం హైదరాబాద్‌లోని హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు ఏపీ సీఎం జగన్ సతీసమేతంగా హాజరయ్యారు. ఈ మేరకు సీఎం జగన్ దంపతులు వరుడు డాక్టర్ లక్ష్మీనారాయణ్ సందీప్, వధువు పూజితలను ఆశీర్వదించారు. అటు ఈ వివాహానికి టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ కూడా వచ్చారు. ఆయనను మంత్రి బొత్స కుటుంబ సభ్యులు సాదరంగా ఆహ్వానించారు. మరోవైపు ఈ వివాహానికి మెగాస్టార్ చిరంజీవితో…
ఉద్యోగులు సీఎం పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఉరుకోబోమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు డిమాండ్లు పరిష్కరిస్తేనే ఉద్యోగులు చర్చలకు వస్తామని చెబుతున్నారన్నారు. జీవోలు విడుదల అయినందున ప్రభుత్వం కొత్త జీతాలను ఇస్తుందన్నారు. ఉద్యోగులు ముఖ్యమంత్రి పై తూలనాడి మాట్లాడితే సంఘం నాయకులే బాధ్యత వహించాల్సి ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. మేము కూడా మాట్లాడితే మరింత ఘర్షణ వాతావరణం ఏర్పడుతుందని మంత్రి…
ఉత్యోగుల ప్రతినిధులు వస్తే మా వైపు నుంచి చర్చలు జరిపేందుకు సిద్ధంగ ఉన్నామని సంప్రదింపుల కమిటీ సభ్యులు సజ్జల రామకృష్ణ రెడ్డి, బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా వారిద్దరూ మాట్లాడుతూ.. ఉద్యోగుల ప్రతినిధులు వస్తే మా వైపు నుండి ప్రభుత్వ నిర్ణయాన్ని నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తామన్నారు. దానిలో భాగంగా వారిని రావల్సిందిగా నిన్న సమాచారం ఇచ్చాం. జీవోలను అభయన్స్‌లో పెట్టాలని కోరారు. కమిటీని అధికారికంగా ప్రకటించే వరకు వచ్చేది లేదన్నారని వారు వెల్లడించారు. అయితే…
ప్రభుత్వ ఉద్యోగులు బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం కరెక్ట్ కాదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఉద్యోగుల ఆందోళనలపై స్పందించిన మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ఆందోళన చేస్తున్న ఉద్యోగులు కొంత మంది మాటలు బాధకరంగా ఉన్నాయన్నారు.భాష అదుపులో ఉండాలి. సంయమనం లేకుండా ఉద్యోగులు మాట్లాడుతున్నారన్నారు. ఉద్యగులకు కావాల్సింది ఘర్షణా లేక సమస్యల పరిష్కారమా..? వారే నిర్ణయించుకోవాలన్నారు. బాధ్యత రహితంగా మాట్లాడుతున్న వారిని ఉద్యోగ సంఘాల నేతలు కట్టడి చేయాలన్నారు. చర్యకు ప్రతిచర్య ఉంటుందన్నారు. ఇలా మాట్లాడితే తీవ్ర…
ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాలు త్యాగాలు త్యాగాలు అని పదేపదే అంటున్నారని ఎవ్వరి కోసం త్యాగాలు చేస్తున్నారో చెప్పాలని ప్రతిపక్షాలను బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. నాగార్జున సాగర్, పోలవరం ప్రాజెక్టులు కడుతుంటే ఎంత మంది రైతులు భూములు ఇవ్వలేదని ఆయన అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చేస్తున్న పనులను త్యాగం అంటారా? ఒక సామాజిక వర్గం కోసం చేసే పనులు త్యాగాలు…
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై ఎవరూ అనుచిత వ్యాఖ్యలు చేయలేదని బొత్స స్పష్టం చేశారు. లేనిది ఉన్నట్లుగా చంద్రబాబు క్రియేట్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఆడపడచుల ఆత్మగౌరవం పేరుతో టీడీపీ డ్రామాలు ఆడుతోందని బొత్స ఆరోపించారు. మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచే సంస్కృతి టీడీపీ నేతలకే ఉందన్నారు. ఆనాడు వైసీపీ ఎమ్మెల్యే రోజా కన్నీరు పెట్టినప్పుడు చంద్రబాబుకు ఆత్మగౌరవం గుర్తుకురాలేదా అని బొత్స ప్రశ్నించారు. Read…