YS Jagan: సూపర్-6 హామీల విషయంలో ప్రభుత్వం ఫెయిల్.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
- సూపర్-6 హామీల విషయంలో ప్రభుత్వం ఫెయిల్
- చంద్రబాబు అబద్ధాలు కొనసాగుతూ వస్తున్నాయి..
- అసెంబ్లీలో కామెంట్స్‌పై జగన్ కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: సూపర్-6 హామీల విషయంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబు అబద్ధాలు కొనసాగుతూ వస్తున్నాయన్నారు.సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా ఉండటానికి మాత్రమే చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. హామీలు అమలు చేయలేకనే బడ్జెట్‌ను ఆలస్యం చేశారని అన్నారు. చంద్రబాబు అనే వ్యక్తి ఎప్పటికీ మారరన్నారు. 2018-19 నాటికి ప్రభుత్వం చేసిన అప్పు రూ.3 లక్షల కోట్లు అని.. వైసీపీ ప్రభుత్వం దిగిపోయే సమయానికి 6.46 లక్షల కోట్లు అప్పులు రాష్ట్రానికి ఉన్నాయన్నారు. వాస్తవాలు ఏమిటో చంద్రబాబు ప్రవేశపెట్టిన బడ్జెట్ పత్రాలు చెబుతున్నాయన్నారు. 11 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు అని చంద్రబాబు రాష్ట్రం అప్పులపై అసత్యాలు చెప్పటం ధర్మమేనా అంటూ ప్రశ్నించారు. కాగ్ రిపోర్టుపై కూడా తప్పుడు ప్రచారం చేశారని వైఎస్ జగన్ మండిపడ్డారు.
Read Also: Earth’s Magnetic Poles: భూమి అయస్కాంత ఉత్తర ధ్రువం రష్యా వైపు కదులుతోంది.. ప్రళయం తప్పదా..?
Also Read
- Cabinet: అహ్మదాబాద్ మెట్రో విస్తరణ, అమరావతిలో సెంట్రల్ కాంప్లెక్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
- Congress-TMC: కాంగ్రెస్‌లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్‌తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
- Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
- Parama Ekadashi: జూన్ 11న పరమ ఏకాదశి.. విష్ణుమూర్తి కటాక్షం పొందాలంటే ఈ నియమాలు తప్పక పాటించాలి.
బీజేపీలో కూడా టీడీపీకి చెందిన మనుషులే ఉండి టీడీపీ అసత్యాలకు మద్దతు ఇస్తారని విమర్శలు గుప్పించారు. బడ్జెట్లో లెక్కలు కూడా చంద్రబాబు పెట్టారన్నారు. కాగ్ ధృవీకరించిన తర్వాత కూడా అప్పులపై మళ్ళీ మాట మారుస్తున్నారన్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన డాక్యుమెంట్స్ పై మాట మార్చటం చంద్రబాబు మాత్రమే చేస్తున్నారని మండిపడ్డారు. బొంకుల బాబు అని చంద్రబాబును ఎందుకు అనకూడదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు 2019లో దిగిపోయే ముందు సుమారు 42 వేల కోట్ల బకాయి పెట్టారన్నారు. ఎఫ్ఆర్బీఎం పరిధిని మించి చంద్రబాబు రూ.28,457 కోట్లు అధిక అప్పులు చేశారని.. వైసీపీ హయాంలో రూ1647 కోట్లు మాత్రమే ఎఫ్ఆర్బీఎం పరిధిని మించి అప్పులు చేశామన్నారు. ఎవరు ఆర్థిక విద్వంసం చేశారో అర్థం అవుతోందన్నారు. రెండేళ్లు కొవిడ్ వల్ల ఇబ్బందులు పడినా కూడా పరిపాలన మాత్రం గాడి తప్పలేదన్నారు. చంద్రబాబు హయాంలో కంటే మా హయంలో 4 శాతం అప్పులు తగ్గాయన్నారు. ఎవరు ఆర్థిక విధ్వంసకారులు అనేది ఈ లెక్కలు చెబుతాయన్నారు.
తాజావార్తలు
-
Begger Role Movies: కోలీవుడ్ హీరోల ‘బిచ్చగాడు’ సెంటిమెంట్ పూరీకి ప్లస్సేనా?
-
Cabinet: అహ్మదాబాద్ మెట్రో విస్తరణ, అమరావతిలో సెంట్రల్ కాంప్లెక్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
-
Congress-TMC: కాంగ్రెస్‌లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్‌తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
-
Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
-
Lenin: అఖిల్ కోసం తిరుపతి వస్తున్న యంగ్ టైగర్.. ‘లెనిన్’ ఈవెంట్‌కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!