Jagan Lawyer: ఆస్తులకు సంబంధించిన కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. కోర్టు ఆదేశాల ప్రకారమే ఆయన హాజరైనట్లు జగన్ లాయర్ స్పష్టం చేశారు. నిర్దేశిత సమయానికి కోర్టుకు చేరుకున్న జగన్, కోర్టు హాల్‌లో కేవలం ఐదు నిమిషాలు మాత్రమే ఉండగా, కోర్టు ఆయన హాజరును రికార్డులో నమోదు చేసి విచారణను ముగించింది. ప్రస్తుతం మళ్లీ కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం లేదని, తదుపరి ఉత్తర్వుల ప్రకారం మాత్రమే జగన్ తిరిగి కోర్టుకు హాజరవుతారని లాయర్ తెలిపారు.
Orry Drug Case: రూ.252 కోట్లు డ్రగ్స్ కేసులో ఓర్రీకి ముంబై పోలీసుల నోటీసులు
కోర్టు హాజరు పూర్తయ్యాక, జగన్ నాంపల్లి కోర్టు ప్రాంగణం నుంచి బయలుదేరి బంజారాహిల్స్‌లోని లోటస్ పాండ్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా కోర్టు నుంచి ఇంటి వరకు రోడ్డు వెంబడి భారీగా అభిమానులు హాజరై జగన్‌ను కలిసేందేకు ఎగబడ్డారు.
Donald Trump: ‘‘ప్రధాని మోడీ ఫోన్ చేశారు’’.. ఆపరేషన్ సిందూర్‌పై ట్రంప్ మరో బాంబ్..