కేరళలోని ఓ బీచ్‌లో అవుట్‌డోర్ అడ్వెంచర్ చేయడానికి ప్లాన్ చేసిన ఇద్దరు పర్యాటకులు తమ పారాచూట్ అనుకున్న చోట దిగకపోవడంతో భయాందోళనకు గురయ్యారు. తిరువనంతపురం గ్రామీణ ప్రాంతంలోని వర్కాలలోని పాపనాశం బీచ్‌లో పారాగ్లైడింగ్ చేస్తున్న ఓ వ్యక్తి, ఓ మహిళకు సంబంధించిన పారాచూట్ విద్యుత్ స్తంభానికి చిక్కుకోవడంతో వారు గట్టిగా కిందపడకుండా స్తంభాన్ని పట్టుకున్నారు.
ఇటీవలే అంగారకుడి మీదకు నాసా పర్సెవరెన్స్ రోవర్ ను పంపింది. ఈ రోవర్ ఉపగ్రహం సేఫ్ గా అంగారకుడి మీదకు ల్యాండ్ చేయడంలో పారాచూట్ కీలక పాత్ర పోషించింది. 70 అడుగుల ఈ పారాచూట్ రోవర్ ను సేఫ్ గా ల్యాండ్ చేయడంతో పాటుగా ఓ రహస్య సందేశాన్ని కూడా అంగారకుడి మీదకు తీసుకెళ్లింది. బైనరీ రూపంలో ఓ కోడ్ ను పారాచూట్ పై ముద్రించారు. గొప్ప పనుల కోసం ధైర్యంగా ప్రయత్నించండి అని ముద్రించారు. నాసా సిస్టం ఇంజనీర్ మైఖేల్ క్లార్క్ బైనరీ…