Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Younger Brother Killed Brothers Wife And His Children In Tirupati

Tirupati Crime: టెంపుల్‌ సిటీలో సంచలనం రేపుతున్న ట్రిపుల్ మర్డర్‌.. అన్నపై కోపమే కారణమా?

Published Date :July 25, 2024 , 8:54 am
By Mahesh Jakki
  • తిరుపతిలో దారుణం
  • వదినను..ఇద్దరు పిల్లలను చంపిన మరిది
  • ఆపై తానూ ఆత్మహత్య
Tirupati Crime: టెంపుల్‌ సిటీలో సంచలనం రేపుతున్న ట్రిపుల్ మర్డర్‌.. అన్నపై కోపమే కారణమా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Tirupati Crime: టెంపుల్‌ సిటీ అయిన తిరుపతిలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి కత్తితో దాడి చేసి ముగ్గురిని హత్య చేసి, అనంతరం తానూ ఆత్మహత్య చేసుకోవడం తిరుపతి పద్మావతి నగర్‌లో కలకలం రేపుతోంది. అన్నమీద కోపంతో ఓ తమ్ముడు.. వదినతో పాటు, వారి ఇద్దరి కూతుళ్లను కిరాతకంగా నరికి చంపిన ఘటన పద్మావతి వర్సిటీ సమీపంలోని పద్మావతి నగర్‌లో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. హత్య చేసిన అనంతరం ఆ వ్యక్తి కూడా ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చెన్నైలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న గుడిమెట్ల మోహన్(36) ఈ దారుణానికి పాల్పడ్డాడు. నెల్లూరుకు చెందిన గుడిమెట్ల తిరుపతిదాస్ రెండేళ్ల క్రితం కుటుంబంతో వచ్చి తిరుపతి పద్మావతి నగర్‌లో నివాసం ఉంటున్నాడు. తిరుపతి దాస్‌ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Read Also: Rain Alert : బయటికి రావొద్దు… రాజధానిలో మూడు గంటల పాటు దంచికొట్టనున్న వాన

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్న మోహన్‌కు అన్నావదినలు కలిసి 2019లో పెళ్లి చేశారు. . పెళ్లై ఓ కుమార్తె పుట్టిన తర్వాత మోహన్‌కు, అతని భార్యకు మధ్య గొడవలు జరగడంతో 2021లో అతని భార్య పుట్టింటికి వెళ్లి పోయింది. అనంతరం వారి మధ్య రాజీ కుదిర్చి.. తమ్ముడి భార్య తల్లిదండ్రులతో మాట్లాడి ఇద్దరూ కలిసి కాపురం చేసుకునేలా చేశాడు తిరుపతిదాస్‌. రాజీ చర్చల సమయంలో తనకు ఇష్టంలేని పెళ్లి చేసి, మనశ్శాంతి లేకుండా చేశావంటూ అన్నపై తమ్ముడు దాడి చేశాడు. ఆపై రాజీ కుదరడంతో మోహన్‌ భార్య కాపురానికి వచ్చింది. కాపురానికి వచ్చిన కొన్ని రోజులకే మళ్లీ గొడవలు ప్రారంభం కావడంతో మళ్లీ తిరిగి పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో చెన్నైలో ఉద్యోగం చేస్తున్న మోహన్ అప్పుడప్పుడు తిరుపతిలోని అన్న ఇంటికి వచ్చి ఉండేవాడు. 2 రోజుల క్రితం మోహన్. చెన్నై నుంచి తిరుపతి వచ్చాడు. బుధవారం సాయంత్రం పాఠశాల నుంచి పిల్లలను ఇంటికి తీసుకువచ్చాడు తిరుపతిదాస్. ఈ క్రమంలోనే పిల్లలను ఇంట్లో దించిన తర్వాత దాస్ బయటకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత అన్న ఇంట్లో లేని సమయంలో ఇంటికి కత్తితో వచ్చి వదిన, పిల్లలపై దాడి చేశాడు. వదిన సునీతను హత్య చేసిన మరిది మోహన్‍.. ఆపై 8, 6వ తరగతి చదువుతున్న ఆమె ఇద్దరు పిల్లలు దేవీశ్రీ, నీరజలను హతమార్చాడు. అనంతరం మోహన్‍ ఆత్మహత్య చేసుకున్నాడు.

Read Also: AP Cabinet: నేడు ఏపీ కేబినెట్‌ భేటీ.. పోలవరం విషయంలో కీలక చర్చ

కొంచెం సేపటికి ఇంటికి తిరిగొచ్చిన తిరుపతి దాస్.. ఇంటికి తాళాలు వేసి ఉండడంతో బయటకు వెళ్లి ఉంటారని భావించాడు. గంట తర్వాత కూడా వారు రాకపోవడంతో అనుమానంతో ఇంటి వెనుక నుంచి చూసే సరికి రక్తపు మడుగులో పడి ఉన్న భార్యా పిల్లల్ని చూసి కుప్పకూలిపోయాడు. ఈ ఘటనలో దాస్ భార్య సునీత(35), కుమార్తెలు దేవిశ్రీ(13), నీరజ(11) హత్యకు గురయ్యారు. నిందితుడు మోహన్‌ హత్యలు చేసిన అనంతరం అక్కడే గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. క్లూస్ టీమ్ సిబ్బంది హత్యలు జరిగిన చోట ఆధారాలు సేకరిస్తున్నారు. తిరుపతి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఎస్పీ సుబ్బరాయుడు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించి విచారణ చేపట్టామని ఏఎస్పీ కులశేఖర్‍ తెలిపారు. పెళ్లై ఓ బిడ్డ పుట్టిన తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలతో విడిపోవడం, అన్న కుటుంబం సంతోషంగా ఉండటంతో వారిపై కక్ష పెంచుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇష్టం లేని పెళ్లి చేశాడని తరచూ అన్నతో గొడవ పడేవాడని స్థానికులు పోలీసులకు తెలిపారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • ap crime
  • Crime News
  • telugu news
  • Tirupati

తాజావార్తలు

  • RCB vs MI: సాల్ట్ ‘పవర్’.. పాటిదార్ ‘స్పీడ్’.. కోహ్లీ ‘క్లాస్’.. వాంఖడేలో ఆర్‌సీబీ విధ్వంసం!

  • Moringa Powder: జిమ్‌కి వెళ్లక్కర్లేదు.. రోజుకు రెండు ముద్దల ఈ పొడి తింటే కొవ్వు కరగాల్సిందే!

  • US-Iran War: పాకిస్తాన్ తర్వాత సీన్‌లోకి రష్యా.. మధ్యవర్తిత్వానికి పుతిన్ సిద్ధం..

  • Axis Bank : నమ్మితే నట్టేట ముంచాడు.. NRI ఖాతా నుంచి రూ. 7 కోట్లు కొట్టేసిన బ్యాంక్ మేనేజర్.!

  • Chanakya Niti: మీ మాటకు విలువ పెరగాలంటే ఏం చేయాలి? ఆచార్య చాణక్యుడు చెప్పిన బెస్ట్ టిప్స్ ఇవే..

ట్రెండింగ్‌

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions