నగరంలో మరో హిట్ అండ్ రన్ చోటుచేసుకుంది. స్కోడా కారు ఓ బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బీ ఫార్మసీ చదువుతున్న యువతి మృతి చెందగా.. యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. కోహెడా వద్ద బైక్ ను ఢీ కొట్టి కారుతో పారి పోతుండగా చైతన్యపురి వద్ద పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కోహెడ వద్ద బైక్ ను ఢీకొట్టిన ప్రదీప్ వర్మ పారిపోయే ప్రయత్నం చేశాడు.. కారు అద్దం పగిలి, అనుమానాస్పదంగా డ్రైవ్ చేస్తుండటంతో.. కారును ఆపిన చైతన్యపురి పోలీసులు ప్రశ్నించారు.
Also Read:IMD Alert: దక్షిణాది రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏఏ రాష్ట్రాలంటే..!
కారు డ్యామేజ్ అయ్యింది.. రిపేర్ కి వెళ్తున్న అని బుకాయించే ప్రయత్నం చేశాడు ప్రదీప్ వర్మ.. అయితే అద్దంపై రక్తపు మరకలు, జుట్టు ఉండటంతో.. పోలీసులకు అనుమానం కలిగింది. దీంతో పోలీసులు ప్రదీప్ వర్మను అదుపులోకి తీసుకున్నారు. కాసేపటికే కోహెడ వద్ద ప్రమాదం జరిగినట్లు సమాచారం రావడంతో.. అక్కడ యాక్సిడెంట్ చేసింది ఈ కారే అని చైతన్యపురి పోలీసులు గుర్తించారు. స్కోడా కారును డ్రైవ్ చేసింది తెనాలికి చెందిన ప్రదీప్ వర్మగా గుర్తించారు.
Also Read:Trump Tariff: చైనాపై 145 శాతం సుంకాలు.. భారత్‌కు జులై 9 వరకు మినహాయింపు
ప్రమాద సమయంలో మద్యం మత్తులో ప్రదీప్ ఉన్నట్లు తెలిపారు. ప్రదీప్ ను అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులకు చైతన్యపురి పోలీసులు అప్పగించారు. యువతి స్పందన మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా తరలించారు. తీవ్ర గాయాలతో యువకుడు సాయి కుమార్ చికిత్స పొందుతున్నాడు. స్పందన, సాయికుమార్ దూరపు బంధువులు.. కాగా కాలేజ్ దగ్గర పిక్ చేసుకుని.. స్పందనను హాస్టల్ వద్ద వదిలేందుకు వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారు.