ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమంలో జడ్జిగా వ్యవహరించే రోజాకు ఎంత పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ వైపు ఎమ్మెల్యేగా.. మరోవైపు టీవీ కార్యక్రమాలతో రోజా బిజీ బిజీగా కనిపిస్తుంటారు. తీరిక లేదు కాబట్టి ఇటీవల సినిమాల్లో నటించడం లేదు. గతంలో 100కు పైగా సినిమాల్లో నటించి తనకంటూ రోజా ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తనకు ప్రస్తుతం ఉన్న హీరోల్లో మహేష్‌బాబు అంటే ఎంతో ఇష్టమని రోజా వెల్లడించారు. ఈ విషయాన్ని జబర్దస్త్‌లోని ఓ స్కిట్ ద్వారా ఆమె బయటపెట్టారు.
Read Also: సినిమా థియేటర్‌ను సీజ్ చేసే అధికారం తహసీల్దార్‌కు లేదు: హైకోర్టు
జబర్దస్త్ హోమ్ టూర్‌లో భాగంగా హైపర్ ఆది టీమ్ నగరిలోని ఎమ్మెల్యే రోజా నివాసానికి వెళ్లారు. అక్కడ హాలులో వేంకటేశ్వర స్వామి ఫోటో ఉండటంతో హైపర్ ఆది.. ఆయన్ని ఏం కోరుకుంటారమ్మా అని ఆది అడిగితే.. కృష్ణ గారి అబ్బాయి మహేష్ బాబుతో సినిమా చేయాలని ఉందంటూ రోజా ఆ దేవుడిని వేడుకున్నారు. దీంతో వెంటనే హైపర్ ఆది పంచ్ వేశాడు. కృష్ణా రామా అని ఇంట్లో కూర్చోవాల్సిన వయసులో మనకెందుకమ్మా ఈ మహేష్ బాబు సినిమాలు అంటూ సెటైర్ వేశాడు. అయితే ఇదంతా స్కిట్‌లో భాగమని తెలుస్తోంది. అనంతరం రోజా కిచెన్ లోకి వెళ్లి టీ పెట్టి హైపర్ ఆది టీమ్ సభ్యులకు ఇచ్చారు.
గతంలో కూడా దొరబాబు ఒక్కడు పేరుతో హైపర్ ఆది స్కిట్ చేశాడు. ఈ స్కిట్‌లో కమెడియన్ దొరబాబు మహేష్ బాబుగా.. శాంతి స్వరూప్ భూమికగా కనిపించారు. దాంతో స్కిట్ అయిపోయిన తర్వాత రోజా వాళ్లకు వార్నింగ్ ఇచ్చారు. ‘నువ్వు మహేష్ బాబువా.. ఫ్యాన్ ఇక్కడ.. చంపేస్తాను.. ఇంకోసారి మహేష్ బాబు అంటే’ అంటూ రోజా స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.