అక్కడ గ్రూపు తగాదాలకు అంతం లేదు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టినా పరిస్థితి మారలేదు. స్థానిక లీడర్ల నుండి, జిల్లా మంత్రుల వరకు అందరితో ఆమెకు తలనొప్పులే కొనసాగుతున్నాయి. లేటెస్టుగా జరుగుతున్న ప్లీనరీలు పరిస్థితిని మరింత స్పష్టం చేశాయి. ప్లీనరీల సాక్షిగా ఏకాకిగా మారారనే టాక్ వినిపిస్తోంది. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గుర్తింపు తెచ్చుకున్నారు రోజా. అయినా సొంత జిల్లాలో మాత్రం చిక్కులు తప్పటం లేదు. తనను అణగదొక్కడానికి చూస్తున్నారని, ఒంటరిని చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న…
జిల్లాల విభజనతో ఏపీ భౌగోళిక స్వరూపం మారిపోయింది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ప్రభుత్వం ప్రకటించడంతో పాత జిల్లాలలో మార్పులు చోటు చేసుకున్నాయి. కోస్తా, రాయలసీమ, ఉత్తరాంధ్రలో జిల్లాల సంఖ్య పెరిగింది. ఒకప్పుడు అతి పెద్ద జిల్లాగా ఉన్న విశాఖ ఇప్పుడు చిన్న జిల్లాగా మారిపోయింది. మరోవైపు రాయలసీమలో ఎన్నడూ ఊహించని మార్పులు జరిగాయి. జిల్లాల విభజన జరిగిన తర్వాత రాయలసీమ పరిధిలోకి సముద్రతీరం రావడం కూడా ఆశ్చర్యపరుస్తోంది. గతంలో నెల్లూరు జిల్లాలో తీరప్రాంతం ఉన్న…
ఏపీ అసెంబ్లీలో జంగారెడ్డిగూడెంలో వరుస మరణాలపై రగడ జరుగుతోంది. ఈ అంశంపై సభలో అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష పార్టీ టీడీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా టీడీపీ సభ్యులపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. టీడీపీ ప్రభుత్వం ఇంటింటికి నీళ్లు ఇచ్చిందో లేదో కానీ లిక్కర్ మాత్రం ఇచ్చిందని వైసీపీ ఎమ్మెల్యే రోజా అసెంబ్లీలో ఎద్దేవా చేశారు. ATM (ఎనీ టైమ్ మందు) అనేలా చంద్రబాబు పాలన సాగిందని…
ఏపీలో కొత్త జిల్లాలపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం నాడు తాతయ్యగుంటలోని గంగమ్మను వైసీపీ ఎమ్మెల్యే రోజా దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తాను తిరుపతిలో పుట్టి పెరిగానని.. అందుకే తరచూ గంగమ్మ గుడికి వస్తుంటానని రోజా తెలిపారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా గంగమ్మ జాతర జరగలేదని.. ఈ ఏడాది కచ్చితంగా అమ్మవారి జాతర ఘనంగా…
ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమంలో జడ్జిగా వ్యవహరించే రోజాకు ఎంత పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ వైపు ఎమ్మెల్యేగా.. మరోవైపు టీవీ కార్యక్రమాలతో రోజా బిజీ బిజీగా కనిపిస్తుంటారు. తీరిక లేదు కాబట్టి ఇటీవల సినిమాల్లో నటించడం లేదు. గతంలో 100కు పైగా సినిమాల్లో నటించి తనకంటూ రోజా ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తనకు ప్రస్తుతం ఉన్న హీరోల్లో మహేష్‌బాబు అంటే ఎంతో ఇష్టమని రోజా వెల్లడించారు. ఈ విషయాన్ని…
టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారుడు గాలి భానుప్రకాష్‌పై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రంగా మండిపడ్డారు. తాను ప్రజల మధ్యే ఉంటానని… ఇక్కడే చావాలని డిసైడ్ అయ్యానని, అందుకే నగరిలో ఇల్లు కట్టుకున్నానని రోజా స్పష్టం చేశారు. తనపై కొందరు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని… తాను అక్రమంగా సంపాదిస్తున్నారని మాట్లాడితే.. మూతి పగిలిపోతుందని గాలి భానును ఉద్దేశించి హెచ్చరించారు. తన బ్యాంక్ బ్యాలెన్స్ బహిర్గతం చేస్తానని.. వైసీపీలో ఉన్నవారి అండదండలతో తనపై గెలవాలనుకుంటే పగటి కలే…
కడప జిల్లాలోని శెట్టిపాలెంలో బంధువులతో సంక్రాంతి జరుపుకునేందుకు చిత్తూరు జిల్లా నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎం జగన్‌తో నటుడు చిరంజీవి భేటీ కావడం మంచి పరిణామమని ఎమ్మెల్యే రోజా అన్నారు. జగన్ ఏది చేసినా ప్రతిపక్షాలు బురదజల్లడం సరికాదని రోజా అభిప్రాయపడ్డారు. సామాన్య ప్రజల కోసం స్కూళ్లు, కాలేజీల ఫీజులను ప్రభుత్వం తగ్గిస్తే యాజమాన్యాలపై కక్ష సాధింపు చర్య అని ఆరోపించారని… కరోనా సమయంలో ప్రజలను…
చిత్తూరు జిల్లాలోని నగరి-పుత్తూరు జాతీయ రహదారి అధ్వానంగా ఉందని.. అలాంటి రోడ్డుకు టోల్ ఛార్జీ వసూలు చేయడం సరికాదని వైసీపీ ఎమ్మెల్యే రోజా అభిప్రాయపడ్డారు. ఈ మేరకు విజయవాడలోని ఆర్‌అండ్‌బీ ప్రత్యేక కార్యదర్శి కృష్ణబాబుకు టోల్ వసూలు చేయవద్దని ఎమ్మెల్యే రోజా వినతిపత్రం సమర్పించారు. చిత్తూరు జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తిరుపతి-చెన్నై రహదారి పూర్తిగా దెబ్బతిందని, వెంటనే బాగు చేయాలని ఆమె కోరారు. Read Also: పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు జాతీయ…
సొంత పార్టీలోని కోవర్టులకు నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా షాకిచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్‌ను నగరి ఎమ్మెల్యే రోజా కలిశారు. ఈ మేరకు వైసీపీలో కోవర్టులపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వైసీపీలో ఉంటూ టీడీపీతో అంటకాగే వారిని ఉపేక్షించే పరిస్థితి లేదని వైసీపీ ఎమ్మెల్యే రోజా స్పష్టం చేశారు. రాష్ట్ర డీజీపీ ఫోటోలతోనూ కోవర్టులు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫొటోలను ఫ్లెక్సీల్లో…
చిత్తూరు జిల్లా నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా యాక్టర్, పొలిటీషియన్‌గానే కాదు.. డాక్టర్‌గానూ తన సేవలందిస్తున్నారు. పుత్తూరు మండలం గొల్లపల్లి గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో శుక్రవారం నాడు ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్యశిబిరాన్ని ఎమ్మెల్యే రోజా ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించడం కోసం ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ శిబిరంలో ఎమ్మెల్యే మెడలో…