వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ మోహన్ కలిశారు. గురువారం తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లిన వంశీ.. కష్ట కాలంలో తనకు అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వంశీ ఆరోగ్య స్థితి గురించి వైఎస్ జగన్ ఆరా తీశారు. ఎప్పుడూ అండగా ఉంటామని జగన్ భరోసా ఇచ్చారు. వల్లభనేని వంశీ వెంట ఆయన సతీమణి పంకజశ్రీ కూడా ఉన్నారు. Also…