ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల వేళ మరో కీలక నిర్ణయం వెలువడే ఛాన్స్ ఉంది. వైసీపీ- టీడీపీ రెబల్ ఎమ్మెల్యేల అనర్హత విషయంలో స్పీకర్ తమ్మినేని సీతారం నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది. రెండు పార్టీల రెబల్ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను విచారణకు రావాల్సిందిగా ఇవాళ అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్‌లు నోటీసులు ఇచ్చారు.
రేపు రెబెల్ ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై స్పీకర్ తమ్మినేని మరోసారి విచారణ చేపట్టనున్నారు. వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి మినహా మిగిలిన ఏడుగురు రెబెల్ ఎమ్మెల్యేలకు మరోసారి విచారించే అవకాశం ఉంది. కాగా.. ఉదయం పూట ముగ్గురు వైసీపీ రెబెల్స్, మధ్యాహ్నం నలుగురు టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని విచారించనున్నారు. రేపు అనర్హత పిటిషన్లపై స్పీకర్ చర్యలు తీసుకుంటారా..? లేదా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
వైసీపీ-టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ తమ్మినేని సీతారాం మరో ఛాన్స్ ఇచ్చారు. అనర్హత పిటిషన్ల పై మరోసారి ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు ఫిబ్రవరి 8న స్వయంగా విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొ్న్నారు. ఫిబ్రవరి 5లోగా లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలి అని నోటీసులో స్పష్టం చేశారు. ఈ మేరకు స్పీకర్ కార్యాలయం నుంచి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు వెళ్లాయి. వైసీపీ నుండి ఫిరాయించిన ఎమ్మెల్యేలు, పిటిషనర్ ప్రసాద్ రాజులకు నోటీసులు…
మహారాష్ట్ర రాజకీయాల్లో శివసేనలో తిరుగుబాటు సంచలనమే సృష్టించింది.. చివరకు సీఎం పదవికి ఉద్ధవ్ థాక్రే రాజీనామా చేశారు.. బీజేపీతో చేతులు కలిపిన శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే.. ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు.. అయితే, పార్టీ నుంచి వెళ్లిపోయింది ఎమ్మెల్యేలే.. ప్రజలు కాదు.. ఇప్పటికిప్పుడు మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలు జరిగినా.. శివసేనకు 100 సీట్లు వస్తాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ నేత సంజయ్ రౌత్.. ఇక, ప్రస్తుతం ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వెంట ఉన్న…
రెబల్ ఎమ్మెలె్యేలపై హాట్ కామెంట్లు చేశారు సంజయ్ రౌత్.. జులై 11వ తేదీ వరకు రెబల్ ఎమ్మెల్యేలను గౌహతిలోనే ఉండమని ఆదేశాలు ఉన్నాయని పేర్కొన్నారు.. అంటే జులై 11 వరకు రెబల్ ఎమ్మెల్యేలకు మహారాష్ట్రలో పని లేదు అని సెటైర్లు వేశారు..