Salman Khan, Ram Charan Release Operation Valentine Movie Trailer: మెగా హీరో వరుణ్ తేజ్, మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ జంటగా నటిస్తోన్న సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా చిత్రంగా రిలీజ్ అవుతున్న ఆపరేషన్ వాలెంటైన్ కోసం వరుణ్, మానుషీలు ఇండియా మొత్తం తిరుగుతూ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, టాలీవుడ్ హీరో రామ్ చరణ్ రంగంలోకి దిగుతున్నారు.
ఆపరేషన్ వాలెంటైన్ సినిమా నుంచి ‘ఫైనల్ స్ట్రైక్’ ఫిబ్రవరి 20న విడుదల కానుందని మేకర్స్ సోషల్ మీడియాలో వెల్లడించారు. థియేట్రికల్ ట్రైలర్ మంగళవారం ఉదయం 11.5 నిమిషాలకు రిలీజ్ కానుందని మేకర్స్ తెలిపారు. హిందీ ట్రైలర్‌ను సల్మాన్ ఖాన్, తెలుగు ట్రైలర్‌ను రామ్ చరణ్ రిలీజ్ చేయనున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్‌లో వస్తున్న సినిమా కాబట్టి థియేట్రికల్ ట్రైలర్ బదులుగా ఫైనల్ స్ట్రైక్ అని మేకర్స్ ప్రకటించారు.
Also Read: Airtel-Amazon Prime: ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్స్.. ఫ్రీగా అమెజాన్ ప్రైమ్ వీడియో!
ఎయిర్ ఫోర్స్ సైన్యం అసమానమైన ధైర్య సాహసాల్ని, దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను ఆపరేషన్ వాలెంటైన్ చిత్రంలో చూపించనున్నారు. వరుణ్ తేజ్ ఎయిర్‌ఫోర్స్ పైలట్‌గా కనిపించనున్నారు. వరుణ్ తేజ్ గత చిత్రాలు గని, గాందీవధారి అర్జునుడు ప్రేక్షకులను పూర్తిగా నిరాశపరిచాయి. ఈ నేపథ్యంలో ఆపరేషన్ వాలెంటైన్‌తో సక్సెస్ అందుకోవాలని మెగా ప్రిన్స్ చూస్తున్నాడు. సినిమా కథపై కూడా చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు.
The operation gets ‘MEGA’ with its arrival🔥
Global 🌟 @AlwaysRamCharan and Bhai @BeingSalmanKhan are set to launch the Final Strike from #OperationValentine Tomorrow at 11:05 AM💥
Stay Tuned ❤️🔥#OPVonMarch1st@IAmVarunTej @ManushiChhillar @ShaktipsHada89 @MickeyJMeyer… pic.twitter.com/BDEM7Apdai
— BA Raju’s Team (@baraju_SuperHit) February 19, 2024