Kadiyam Srihari: తెలంగాణలో లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణ పథకం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే సన్నధాన్యానికి బోనస్ ఇచ్చిన ఘనత తెలంగాణదని, ఈనెల 26 నుంచి ఎకరాకు 6000 రూపాయల చొప్పున పంట పెట్టుబడి సాయం రైతుల అకౌంట్లో ఎలాంటి ఆంక్షలు లేకుండా జమ చేయబడుతుందని ఆయన తెలిపారు. కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీ రైతుల ప్రయోజనాల కోసం తీసుకున్న అనేక చర్యలను తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 25 లక్షల మంది రైతులకు 21 వేల కోట్లు విలువైన పంట రుణాల మాఫీ చేసిందని, ఈ విషయంలో ఏ ఇతర రాష్ట్రంలో ఇంత పెద్ద మొత్తంలో రుణాలు మాఫీ చేయలేదని ఆయన చెప్పుకొచ్చారు. పెద్ద మనుషులు, పది ఏండ్లు అధికారంలో ఉన్న వారు విమర్శలు చేయడం విడ్డూరం అని రైతులకు మద్దతు తెలిపే విధంగా మాట్లాడారు.
Also Read: Kiran Kumar Reddy: నేను సీఎం పదవి ఎవరినీ అడగలేదు.. దానికోసం ఎవరికీ కప్పు టీ కూడా ఇవ్వలేదు..
ఎగువ ప్రాంతంలోని కుంటలు, చెరువులు గోదావరి జలాలతో నింపాలని నా ఆలోచనని తెలిపారు. నేను భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, దేవాదుల ప్రాజెక్టు ద్వారా నీటిని నింపాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. ప్రస్తుతం ప్రారంభించిన పనులు గురించి మళ్లీ విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. దేవాదుల ప్రాజెక్టు లేకపోతే స్టేషన్ ఘనపూర్ కు బతుకు లేదని, 3 సంవత్సరాల తర్వాత పనులు మొదలు పెట్టి ఇప్పుడు వాటిని గురించి మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. ఎగువ ప్రాంతాలకు సాగునీరు ఎందుకు ఇవ్వలేదని, సాగునీరు అందించాలనే ఉద్దేశంతో 104 కోట్ల రూపాయలతో మూడు లిఫ్ట్ స్కీములను మంజూరు చేసి చేపించానని ఆయన అన్నారు.