యమహా బైక్ లకు యూత్ లో మంచి క్రేజ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే.. ఈ కంపెనీ నుంచి వచ్చిన బైకులకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.. తాజాగా ఈ కంపెనీ నుంచి మరో బైకును లాంచ్ చేశారు.. అతి త్వరలో భారత మార్కెట్లోకి యమహా ఆర్ఎక్స్100 బైక్ రాబోతోంది. ఐకానిక్ బైకులకు యూత్‌లో ఉన్న క్రేజ్ దృష్ట్యా జపాన్ టూవీలర్ సంస్థ యమహా మళ్లీ భారత్‌లో కొత్త అవతార్‌లో RX100 బైక్ రీలాంచ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది..
యమహా ఐకానిక్ ఆర్ఎక్స్100 కొత్త అవతార్‌లో వచ్చే అవకాశం కనిపిస్తోంది. అంతేకాదు.. భారీ ఇంజిన్ పరిమాణంతో రానుంది. అంటే.. కొత్తబైకులో RX ఉంటుంది.. అయితే 100 వద్ద 225.9cc ఇంజిన్ అని ఉండవచ్చు. అత్యంత శక్తివంతమైన ఇంజిన్ సామర్థ్యంతో రానుంది.. ఈ బైక్ ఇంజన్ మాత్రం యూత్ ను బాగా ఆకట్టుకుంటుంది.. 20.1బీహెచ్‌పీ పవర్, 19.93ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అదేవిధంగా BS6 ఫేజ్ 2 కఠినమైన ఉద్గారాలకు తగినట్టుగా డిజైన్ చేసినట్టు నివేదికలు చెబుతున్నాయి. ఆర్ఎక్స్100 కొత్త అవతార్ గత మోడల్ బైక్ మాదిరిగా కొన్ని క్లాజిక్ డిజైన్ ఎలిమెంట్‌లను కలిగి ఉంటుంది.
Also Read: IPL 2024 Schedule: నేడు ఐపీఎల్ షెడ్యూల్ విడుదల.. చెపాక్ స్టేడియంలో తొలి మ్యాచ్!
ఇకపోతే 1980 నుంచి ఇప్పటివరకూ పాపులర్ అయిన బైకుల్లో యమహా RX100 మోస్ట్ పాపులర్ బైకు అని చెప్పవచ్చు. యమహా 1985 నుంచి 1996 వరకు టూ-స్ట్రోక్ మోటార్‌సైకిల్‌ను తయారు చేసింది. ఆ తర్వాత 2005 నుంచి 2007 వరకు ఈ మోడల్స్ అందుబాటులో ఉండేవి.. ప్రస్తుత ఆర్ఎక్స్100లో కొనసాగించే అదే మోనికర్‌ను అలాగే ఉంచుతుందని సమాచారం.. ఇక ఈ బైకు ధర విషయానికొస్తే.. రూ. 1.25 లక్షల నుంచి రూ. 1.50 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.. త్వరలోనే ఈ బైక్ లాంచ్ కానుంది.. ఇప్పటినుంచే ఈ బైకు కోసం యూత్ ఆసక్తి కనబరుస్తున్నాయి..