2025 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్ మరికొద్దిసేపట్లో లండన్‌లోని లార్డ్స్ స్టేడియంలో ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ బవుమా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్ చేయనుంది. రెండు జట్లు పటిష్టంగా ఉండడంతో రసవత్తర పోరు ఖాయంగా కనిపిస్తోంది. ఐసీసీ టోర్నీల్లో తిరుగులేని రికార్డు ఉన్న ఆస్ట్రేలియాను ఓడించి విజేతగా నిలవడం దక్షిణాఫ్రికాకు అంత తేలికేం కాదు.
డబ్ల్యూటీసీలో ఇది మూడో ఫైనల్. తొలి రెండు డబ్ల్యూటీసీ ట్రోఫీలను న్యూజిలాండ్, ఆ్రస్టేలియా గెలుచుకున్నాయి. గత రెండు ఫైనల్లో భారత్ ఓడిన విషయం తెలిసిందే. మూడోసారి టీమిండియా తుది పోరుకు అర్హత సాధించలేకపోయింది. ఈసారి మూడో స్థానంతో సరిపెట్టుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆసీస్ టైటిల్ నిలబెట్టుకోవాలని చూస్తోంది. మరోవైపు 27 ఏళ్లుగా ఐసీసీ టైటిల్ సాధించలేకపోయిన దక్షిణాఫ్రికా ఈ సువర్ణావకాశాన్ని ఒడిసిపట్టుకోవాలని భావిస్తోంది.
తుది జట్లు:
ఆస్ట్రేలియా: ఖవాజా, లబుషేన్, కామెరూన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, హెడ్, వెబ్‌స్టర్, కేరీ (వికెట్ కీపర్), కమిన్స్ (కెప్టెన్), స్టార్క్, హేజిల్‌వుడ్, లైయన్.
దక్షిణాఫ్రికా: మార్‌క్రమ్, రికిల్‌టన్, ముల్దర్, బవుమా (కెప్టెన్), స్టబ్స్, బెడింగ్‌టన్, కైల్ వెరీన్ (వికెట్ కీపర్), యాన్సెన్, కేశవ్ మహరాజ్, రబాడ, ఎంగిడి.