దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడ అరుదైన రికార్డు నెలకొల్పాడు. దక్షిణాఫ్రికా తరఫున టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన నాలుగో బౌలర్‌గా నిలిచాడు. ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ 2025లోని మొదటి ఇన్నింగ్స్‌లో అయిదు వికెట్ల ప్రదర్శన చేయడంతో రబాడ ఖాతాలో ఈ రికార్డు చేరింది. రబాడ ఇప్పటివరకు 71 టెస్టుల్లో 332 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో రబాడ అత్యుత్తమ గణాంకాలు 7/112 కాగా.. 10 వికెట్స్…
ఆస్ట్రేలియాను స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన విదేశీ బ్యాటర్‌గా రికార్డుల్లో నిలిచాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2025లో స్మిత్ (66; 112 బంతుల్లో 10 ఫోర్లు) హాఫ్ సెంచరీ చేయడంతో ఈ రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. ఈ జాబితాలో ఇదివరకు ఆస్ట్రేలియాకే చెందిన వారెన్ బార్డ్స్లీ (575 పరుగులు) అగ్ర స్థానంలో ఉండగా.. తాజా ఇన్నింగ్స్‌తో స్మిత్ టాప్…
2025 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్ మరికొద్దిసేపట్లో లండన్‌లోని లార్డ్స్ స్టేడియంలో ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ బవుమా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్ చేయనుంది. రెండు జట్లు పటిష్టంగా ఉండడంతో రసవత్తర పోరు ఖాయంగా కనిపిస్తోంది. ఐసీసీ టోర్నీల్లో తిరుగులేని రికార్డు ఉన్న ఆస్ట్రేలియాను ఓడించి విజేతగా నిలవడం దక్షిణాఫ్రికాకు అంత తేలికేం కాదు. డబ్ల్యూటీసీలో ఇది మూడో ఫైనల్. తొలి రెండు డబ్ల్యూటీసీ ట్రోఫీలను…